జూనియర్ ఎన్టీఆర్‌పై సునిశిత్ వివాదాస్పద వ్యాఖ్యలు .. తన్నులు తిన్నా మారని తీరు ..!

యూట్యూబ్ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో మీమ్స్ ఫాలో అయ్యేవారికి సాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ అంటే పరిచయం అవసరం లేదు. లాక్ డౌన్ సమయంలో అనేక మంది సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యారు. అలాంటివారిలో సునిశిత్ ఒకరు.

తాను చేయాల్సిన సినిమాలను హీరోలు లాక్కుని మరి చేశారని కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయడంతో సాక్రిఫైజింగ్ స్టార్ గా పిలవబడుతున్నాడు. ఇటీవల ఉపాసన కొణిదెలపై అనుచిత వ్యాఖ్యలు చేసి తన్నులు తిన్న ఈ స్టార్ తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Sacrificing Star Sunisith Comments On Jr NTR

హీరోయిన్లతో డేటింగ్: సాక్రిఫైజింగ్ స్టార్ గా పిలవబడే సునిశిత్ పుష్ప, దసరా సినిమాలకు ముందుగా అతన్నే హీరోగా తీసుకుందామనుకున్నారంటూ చేసిన వ్యాఖ్యలతో చాలా ఫేమస్ అయిపోయాడు. అంతకుముందు హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాని చెప్పి షాక్ ఇచ్చాడు. అతని వ్యాఖ్యలకు లావణ్య పోలీస్ కంప్లయింట్ కూడా ఇచ్చింది. అలాగే పలువురు హీరోయిన్లతో డేటింగ్ చేసినట్లు కూడా చెప్పుకొచ్చాడు.

Sacrificing Star Sunisith Comments On Jr NTR

పర్సనల్ విషయాలపై: ఇటీవల రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెలతో గోవాకు లాంగ్ డ్రైవ్ వెళ్లినట్లు, తనను ప్రేమలో పడేయమని ఉపాసనకు చెర్రీ సరదాగా చెప్పినట్లుగా కామెంట్స్ చేశాడు సునిశిత్. ఈ కామెంట్స్ వైరల్ కాగా రామ్ చరణ్ ఫ్యాన్స్ వచ్చి సునిశిత్ ను చితకబాదారు. ఇంకోసారి పర్సనల్ విషయాలపై అలాంటి వ్యాఖ్యలు చేయకని మందలించి డబ్బు కూడా ఇచ్చారు. అయినా మారని సునిశిత్ తాజాగా తారక్, ప్రభాస్ పై వ్యాఖ్యలు చేశాడు.

Sacrificing Star Sunisith Comments On Jr NTR

ప్రభాస్ తో మందు బాటిల్: తాను ప్రభాస్ కు ఫ్రెండునని, ముంబై వెళ్లినప్పుడు తన రూమ్ కి మందు బాటిల్ పంపమని ప్రభాస్ కు ఫోన్ చేసినట్లు సునిశిత్ తెలిపాడు. ప్రభాస్ తో పాటు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తనకు బాగా క్లోజ్ అని అన్నాడు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ పెద్ద హీరో అయినా.. ఆయనవి పోర్న్ ఫిలింస్ ఉన్నాయని పెద్ద షాక్ ఇచ్చాడు సునిశిత్.

తారక్ ఫ్యాన్స్ వంతు: జూనియర్ ఎన్టీఆర్ పోర్న్ ఫిలింస్ చేశాడనే సీక్రెట్ ను టాలీవుడ్ లో చెప్పే ఏకైక హీరో తానే అని, అతను తప్పా ఇంకెవరు చెప్పలేరని మాట్లాడాడు సునిశిత్. ప్రస్తుతం సునిశిత్ వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే రామ్ చరణ్ ఫ్యాన్స్ చితక్కొట్టారని, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పగలగొడతారని కామెంట్స్ పెడుతున్నారు.

Sacrificing Star Sunisith Comments On Jr NTR

రెండు రోజులు కాకముందే: అంతేకాకుండా మెగా ఫ్యాన్స్ చేతిలో తన్నులు తిని రెండు రోజులు గడవక ముందే సునిశిత్ ఇలా మాట్లాడటంపై పలువురు ఆగ్రహిస్తున్నారు. అతన్ని ఇంటర్వ్యూ చేసిన వాళ్లను కూడా చితక్కొట్టాలని అంటున్నారు. అయితే చెర్రీ ఫ్యాన్స్ సునిశిత్ ను కొట్టి చివర్లో డబ్బులిచ్చినట్లుగానే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చిన కొట్టిన లాస్ట్ లో డబ్బులు ఇస్తాడని ఆశపడ్డాడేమో అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి ఈ వ్యాఖ్యలపై తారక్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X