»   » సదా, స్నేహా ఉల్లాల్ కోల్డ్ వార్ ముగిసినట్లేనా

సదా, స్నేహా ఉల్లాల్ కోల్డ్ వార్ ముగిసినట్లేనా

Posted By:
Subscribe to Filmibeat Telugu

లేటెస్ట్ గా క్లిక్ అనే హిందీ హర్రర్ చిత్రంలో చేసిన స్నేహ ఉల్లాల్, సదా ఇద్దరూ రకరకాల స్టేట్ మెంట్స్ ఇద్దరూ వార్తలు కెక్కుతున్నారు. అయితే సదా ఈ గొడవకు ముగింపు పలకాలని ఆశిస్తోంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ...తనకూ స్నేహాకు మధ్య ఏ విభేధాలు లేవని,కేవలం క్లిక్ చిత్రం ప్రమేషన్ లో ఆమెకు ప్రయారిటీ ఇవ్వటం తనని భాదించిందని చెప్తోంది. తను చాలా కాలంగా హిందీలో చిత్రాలు చేస్తున్నానని ఆ విషయాన్ని గుర్తించకుండా దర్శక, నిర్మాతలు ప్రవర్తిస్తున్నారనేదే తన బాధ అంటోంది. అలాగే స్నేహాకు సినిమాలో పెద్ద సీన్స్ లేవు..అంటూ స్నేహా కామెంట్ చేసిన విషయం గురించి ప్రస్దావిస్తూ...అది తనకు సంభందం లేని విషయం అని, సినిమా కమిట్ అయ్యేటప్పుడు సాధారణంగా కధ, పాత్ర, ఎన్ని సీన్స్ తాను ఉంటామనేది చూసుకునే ఒప్పుకోవటం జరుగుతుందని, మరి స్నేహాకు అన్యాయం తెలియకుండా ఎలా జరిగిందో అర్ధం కావటం లేదంది. ఇక తానకీ ఆ విషయం తెలియదని ఎందుకంటే తానూ, స్నేహా కలిపి చేసిన సన్నివేశాలు చాలా తక్కువని చెప్పుకొచ్చింది. అలాగే స్నేహ బాధలో ఏమన్నా తాను పట్టించుకోదలుచుకోలేదని, తనున్నా ఆ సిట్యువేషన్ లో అలాగే బిహేవ్ చేస్తానంటూ చెప్పుకొచ్చింది. మరి స్నేహ ఏమంటుందో వేచి చూడాలి.ప్రస్తుతం స్నేహ ఉల్లాల్...బాలయ్య. స్నేహా చిత్రంలో చేస్తున్న సంగతి తెలిసిందే..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu