ఎవరైనా ఓకె :సదా

By Staff

Sadha
వెళ్ళవయ్యా వెళ్ళూ అంటూ 'జయం' సినిమాలో తనదైన మేనరిజంతో పాపులరైన సదా ఈ మధ్య అవకాశాలు లేక అయోమయంగా చూస్తోంది.విక్రమ్ తో చేసిన అపరిచితుడు తర్వాత ఆమె కెరీర్ గ్రాఫ్ అంతు చిక్కని రీతిలో పడిపోయింది. తర్వాత వచ్చిన అమ్మ రాజశేఖర్ టక్కరి తన కెరీర్ ని మలుపు తిప్పుతుందేమోనని రెచ్చిపోయి చేసినా ఫలితం లేకుండా పోయింది. మొన్న వారం రిలీజయిన మోహిని చిత్రం ఓపినింగ్స్ కూడా లేకుండా వెలాతెలా పోయింది. దాంతో తనని ప్రేక్షకులు యే రీతిలో ఆదరిస్తున్నారో అర్ధం చేసుకున్న ఆమె ఓ డెషిసన్ కి కొచ్చింది. దొరికిందే అవకాశం అన్న రీతిలో వచ్చిన ప్రతీ ఆఫర్ ని ఒప్పుకుంటోంది.

ప్రస్తుతం 'రోజాపూలు' ఫేం శ్రీరామ్ కథానాయకుడిగా, ఎస్.పి.ఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నూకారపు సూర్యప్రకాష్ నిర్మిస్తున్న చిత్రం 'బృందావనం' లో ఆమె కనిపించటానికి కమిటయ్యింది. ఈ చిత్రం ద్వారా సి.ఆర్.ఆర్.కృష్ణని అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్నాడు. అతను లేడీ సినిమాటోగ్రాఫర్ విజయశ్రీ భర్త. ఈ చిత్రం జూన్ నెల రెండవ వారంలో ప్రారంభం కానుంది. లవ్, మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి మరుధూరి రాజా సంభాషణలు రాస్తున్నారు. మణిశర్మ ఆధ్వర్యంలో ప్రస్తుతం మ్యూజికల్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. దాంతో ఒకప్పుడు కథ,బ్యానర్ వ్యాల్యూ, పేరున్న హీరో,పెద్ద దర్శకుడు కావాలంటూ వగలు పోయిన ఆమె పరిస్థితి కాస్త మారేసరికి ఎవరైనా ఓ.కె అంటూ ఇలా కాళ్ళ బేరానికి వస్తోంది అంటూ వెనుక ఫిల్మ్ నగర్ వాసులు ఎగతాళిగా నవ్వుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X