వెంకటేష్ తో ఛాన్స్ మిస్సయ్యే ఛాన్సే లేదు..సదా
జయం చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన సదా కెరీర్ చెప్పుకోతగిన రీతిలో ఏమీ బాగోలేదు. అయితే తాజాగా ఆమెకు వెంకటేష్ సరసన చంద్రముఖి సీక్వెల్ లో చిన్న వేషం వచ్చింది. దాని గురించి చెబుతూ.."'చంద్రముఖి' లో నటించాల్సిందిగా పి.వాసు నన్ను కోరారు. కానీ 'అపరిచితుడు' చిత్రంతో బిజీగా ఉన్న నేను ఆయనకు నో చెప్పాల్సి వచ్చింది. ఆ పాత్ర జ్యోతికకు దక్కింది. దాంతో జ్యోతిక హీరోయిన్‌గా ఏ రేంజ్‌కు వెళ్లిందనేది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కన్నడంలో సూపర్ హిట్ అయిన 'ఆప్తరక్షక' నటించాల్సిందిగా పి.వాసు మరోసారి కోరారు. కానీ అనివార్యకారణాల వలన దానిని కూడా వదులుకున్నాను. ప్రస్తుతం ఆ చిత్రం తెలుగులో వెంకటేష్ హీరోగా 'చంద్రముఖి 2' గా నిర్మితమవుతోంది. 'చంద్రముఖి 2'లో నటించాల్సిందిగా పి.వాసు నన్ను మళ్లీ అడిగారు. ఈ సారి మాత్రం ఆ ఛాన్స్ మిస్సవ్వను" అని సదా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సదా కన్నడంలో 'తుంటా తుంటి', తమిళంలో 'పులి వేషం' చిత్రాలతో సదా బిజీగా ఉన్నానని చెప్పింది.


Click it and Unblock the Notifications











