సదా సంశయం..

By Staff

ఈ చిత్ర విచిత్ర పరిశ్రమ ఎప్పటికీ అర్థం కావడం లేదని హీరోయిన్‌ సదా తలపట్టుకుంటోంది. శంకర్‌ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో తీసిన అపరిచితుడు చిత్రంలో విక్రమ్‌ సరసన హీరోయిన్‌గా ప్రముఖ పాత్ర పోషించిన సదా ఆ చిత్రం విజయం బోలెడు ఆఫర్లు తెస్తుందని నమ్మేసింది. అనుకున్నట్టే ఆ చిత్రం దక్షిణాది అంతా సూపర్‌ హిట్‌ అయింది.. కానీ సదాకు మాత్రం సినిమాలు రాలేదు. ఇది వరకూ కనీసం తెలుగులో అయినా మార్కెట్‌ ఉండేది. కానీ ఇటీవల బాలకృష్ణ సరసన ఎ.ఎస్‌. రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో వచ్చిన వీరభద్ర చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడటంతో సదాకు తెలుగులో దారులు మూసుకుపోయాయి. అపరిచితుడు లాంటి హిట్‌ సినిమా చేశాక కూడా ఇదేం పరిస్థితబ్బా అని mp;3122;ో పడింది. చేసేది లేక ప్రస్తుతం ఆమె కుర్ర హీరోలతో సైతం నటించేందుకు సిద్ధమంటూ కొత్త హీరోలకు ఫీలర్లు పంపిస్తున్నట్టు సినీవర్గాల భోగట్టా.

సదా ప్రస్తుతం మళయాలంలో సురేశ్‌ గోపి హీరోగా నటించే జన్మమ్‌ చిత్రంలో ఒక ఐటెమ్‌ సాంగ్‌కి పరిమితం అయింది. ఆ పాట కూడా ఆమెకు డైరెక్టుగా రాలేదు. మొదట నయనతారను అడిగితే, ఆమె డేట్స్‌ లేక ఖాళీ లేదన్నప్పుడు నిర్మాతలు సదాని సంప్రదించారు. దక్కిందే చాలన్నట్టు సదా వెంటనే ఓకె చెప్పేసింది కూడా. ఐదు రోజుల పాటు కేరళలో ఈ పాట చిత్రీకరణ జరుగగా, సదా చాలా చక్కగా సహకరించిందని, చాలా కష్టపడి డాన్స్‌ చేసిందని నిర్మాతలు కితాబు నిచ్చారు.

మరిన్నికథనాలు

Read more about: heroine sada in dilemma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X