ఐటం సాంగ్ చేస్తోన్న హీరోయిన్ సదా
హైదరాబాద్ : 'జయం' సినిమాలో వెళ్లవయ్యా వెళ్లూ... అంటూఅదరకొట్టిన సదా ఆ తర్వాత పెద్ద స్టార్స్ సరసన చేసింది. తెలుగుతోపాటు తమిళంలో ఓ వెలుగు వెలిగింది. అయితే శంకర్ తీసిన 'అపరిచితుడు' తరవాత ఆమె పూర్తి ఖాళీ పడిపోయింది. సినిమా హిట్టయ్యాక..
సదాకు చాలా అవకాశాలొస్తాయని భావించారు. కానీ అలా జరగలేదు. దాంతో ఇప్పుడు ఐటం సాంగ్ లైనా చేసి లైమ్ లైట్ లో ఉండాలనే ప్రయత్నం చేస్తోంది.
సదాకు చాలా అవకాశాలొస్తాయని భావించారు. కానీ అలా జరగలేదు. దాంతో ఇప్పుడు ఐటం సాంగ్ లైనా చేసి లైమ్ లైట్ లో ఉండాలనే ప్రయత్నం చేస్తోంది.
సతా రీసెంట్ గా... ఓ ద్విభాషా చిత్రంలో సదా ఐటం సాంగ్ చేసింది. విశాల్ హీరోగా గా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంజలి, వరలక్ష్మి హీరోయిన్స్ . సుందర్.సి. దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సదా ఓ ప్రత్యేకగీతంలో నర్తించింది. అయితే తాను చేసింది ఐటెమ్ సాంగ్ కాదు అంటోంది సదా.
సదా మాట్లాడుతూ ''దాంట్లో కేవలం గీతంలో నర్తించేందుకే పరిమితం కాలేదు. కథలో భాగంగా ఓ సన్నివేశం కూడా నాపైన వస్తుంది. ఇదో ప్రత్యేక పాత్ర అనుకొంటున్నాను'' అని చెప్పింది. అయితే ఐటం సాంగ్ లు చేయటంలో తప్పేముంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ అందరూ చేస్తున్నవే కదా..అందులో అయినా మన ప్రతిభ కనపడటం ముఖ్యం అంటున్నారు సినీ జనం.


Click it and Unblock the Notifications












