కామిక్ ధ్రిల్లర్ ('మైత్రి' ప్రివ్యూ)

By Srikanya

హైదరాబాద్: మంత్ర వంటి థ్రిల్లర్ లకు తెలుగులో మంచి ఆదరణే లభించింది. హీరోయిన్ ఓరియెంటెడ్ గా నడిచే ఈ చిత్రాలకు ఓ వర్గం ప్రేక్షకులు ఎప్పుడూ ఉంటారు. వారిని దృష్టిలో పెట్టుకుని తీసిన చిత్రంలా ఈ రోజు విడుదల అవుతున్న చిత్రం మైత్రి. సదా, నవదీప్ ల కాంబినేషన్ లతో రూపొందిన ఈ చిత్రం ద్వారా సూర్యరాజు దర్సకుడుగా పరిచయవుతున్నారు.

కథ ప్రకారం... అమెరికాలో మోడల్‌గా రాణిస్తున్న ఓ తెలుగమ్మాయి మైత్రి (సదా). ముఖ్యమైన పని నిమిత్తం హైదరాబాద్‌కి వస్తుంది. వారం రోజుల్లో తిరిగి వెళ్లాల్సిన మైత్రికి... ఆల్బమ్స్‌ రూపొందించే దర్శకుడు దీపు (నవదీప్‌)తో పరిచయం ఏర్పడుతుంది. తను తీయబోయే ఆల్బమ్‌లో ఆమెను నటించమని అడుగుతాడు. అందుకు ఒప్పుకొన్న మైత్రి... దీపుతో కలిసి ఓ భవంతిలో దిగుతుంది. అక్కడ వారిద్దరికీ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అందుకు కారకులు ఎవరు? మైత్రి తిరిగి అమెరికా వెళ్లిందా... లేదా? అనే విషయాల్ని తెరపైనే చూడాలి.

దర్శకుడు మాట్లాడుతూ ''వినోదం, ఉత్కంఠత మేళవింపుతో తెరకెక్కిన చిత్రమిది. కథలో చోటు చేసుకొనే మలుపులు ప్రేక్షకుడిని రక్తికట్టిస్తాయి. భారతీయ సంస్కృతిలో చీరకట్టుకు ఉన్న ప్రాధాన్యాన్ని చెబుతూ సాగే పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అన్నారు.

సంస్థ: హను సినీ క్రియేషన్స్‌
నటీనటులు: నవదీప్‌, సదా, డాక్టర్‌ బ్రహ్మానందం, ఉత్తేజ్‌, చిత్రం శీను, సుమన్‌ శెట్టి, భిక్షు, కళ్ళు చిదంబరం, సత్యం రాజేష్‌, కీర్తి, అల్లరి సుభాషిణి, జయవాణి, ఇషిక తదితరులు
నిర్మాత: రాజేష్‌కుమార్‌
సంగీతం: వికాస్
ఛాయాగ్రహణం: సెల్వ
ఎడిటింగ్: వినయ్,
కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు, దర్శకత్వం: సూర్యరాజు
విడుదల: శుక్రవారం

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X