సదాకీ ఆ పిచ్చి
జయం సూపర్ హిట్ తో ఒక్కసారిగా దూసుకొచ్చిన సదాకి ఇప్పుడు ఓ కొత్త పిచ్చి పట్టుకుంది. అదే సైజ్ జీరో. తన తోటి హీరోయిన్స్ వెలిగిపోవటానికి అదే కారణమని భావించిన ఆమె ఆ ప్రయత్నాల్లో పడింది. అయితే అంతకు ముందు ఉన్న ఛాన్స్ కూడా పోతోందని సమచారం. స్క్రిక్టుగా ఎక్సర్ సైజులు, డైట్ కంట్రోలులో పడి సైజులు సరిచేసుకునే ప్రయత్నాలు ప్రారంబించింది. అయితే అవి ఆమెకు సరిపడలేదని, ఎప్పుడు చూసినా ఏదో కోల్పోయిన దానిలా నీర్సంగా ఉంటోందని అంటున్నారు.
నిజానికి అపరిచితుడు అనంతంరం ఆమె తన కెరీర్ వెలిగిపోతుందని భావించింది. కానీ ఆ తర్వాత వచ్చిన పాత్రలేవి ఆమె కెరీర్ ని అరుంగుళం కూడా ముందుకు లాగలేకపోయాయి. అందులోనూ సెక్సీఫ్పీల్ తగ్గిందని అంతా అనటం ఆమెను మరింత క్రుంగతీసిందంటున్నారు. మరో ప్రక్క ఎవరి గోల వారిదే చిత్రం హింది రీమేక్ రిలీజ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అదేమీ ఫలించటం లేదు. ఈ డిప్రెషన్లో ఉన్నామెకు ఈ సైజ్ జీరో వ్యవహారం పెద్ద తలనొప్పిలా తయారైంది. ప్రస్తుతం శ్రీనివాస రెడ్డి అఆఇఈ చిత్రంలో చేసిన ఆమె కొన్ని హాట్ స్టిల్స్ తో ముందు కొస్తోంది కానీ అవైనా ఆకట్టుకుంటాయా అన్నది సందేహమేనంటున్నారు.


Click it and Unblock the Notifications











