పెద్ద హీరో అండతో సదా సెకండ్ ఇన్నింగ్స్
జయం నుంచి అపరిచితుడు చిత్రం దాకా కంటిన్యూగా దాదాపు 30 సినిమాలు దాకా చేసుకుంటూ పోయిన సదా ఆ తర్వాత చల్లబడిపోయింది. ఆమె కెరీర్ పూర్తిగా క్లిక్ లాంటి హర్రర్ సినిమాల స్ధాయికి పడిపోయింది. అప్పటికీ శ్రీకాంత్ సరసన ఆమె అఆఇఈ వంటి సినిమాలు చేసినా అవి డిజాస్టర్ అయ్యి ఆమెను మరింత పడేసాయి. దాంతో ఆమె ఇక్కడ లాభం లేదనుకుంది కన్నడ పరిశ్రమకు వెళ్లి సెటిలైంది.
అక్కడా పెద్దగా కలిసిరాకపోవటంతో ఇప్పుడు మళ్లీ తెలుగు నుంచి సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాలని ప్రయత్నం మొదలెట్టింది. అందుకు రవితేజ సహకరిస్తున్నాడని సమాచారం. రవితేజ సరసన ఓ పెద్ద చిత్రంలో ఆమె బుక్కైనట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా పరుశరామ్ దర్సకత్వంలో అశ్వనీదత్ రూపొందించే మాస్ ఎంటర్టైనర్ లో ఆమె సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఇక రవితేజ తాజా చిత్రం నిప్పు రీసెంట్ గా విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











