సదా హీరోయిన్ గా 'ఆయనకి ఐదుగురు'

By Srikanya

జయం చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన సదా అపరిచితుడు చిత్రం తర్వాత మాయమైపోయింది. అయితే ఆమె హిందీలో నటించిన లవ్ కిచిడి అనే చిత్రం మాత్రం తెలుగులో ఇప్పుడు డబ్బింగై విడుదల అవుతోంది. ఈ చిత్రానికి 'ఆయనకి ఐదుగురు' అనే టైటిల్ పెట్టారు. ఏ వన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న 'ఆయనకి ఐదుగురు' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 20న సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాత చెప్పారు.

రణదీప్ హీరోగా నటించిన ఈ చిత్రంలో సదా, రీమాసేన్, దివ్యదత్తా, కల్పన, సోనాలి కులకర్ణి, రీతూపర్ణ ఘోష్ హీరోయిన్లు.ఈ సందర్భంగా దర్శకుడు భాష్యం శ్రీనివాస్ మాట్లాడుతూ 'అసభ్యతకు తావు లేకుండా ప్రారంభం నుంచి చివరి వరకూ వినోదభరితంగా రూపుదిద్దుకున్న చిత్రమిది. కథ మొత్తం ఫైవ్ స్టార్ హోటల్ నేపథ్యంలో జరుగుతుంది. ఆ హోటల్‌లో కుక్‌గా పనిచేసే హీరోకి జీవితాన్ని సరదాగా గడపాలని కోరిక. అందుకే అందమైన యువతులతో పరిచయం పెంచుకుని వారితో ఎంజాయ్ చేయాలనుకుంటాడు.

అతని ప్రవర్తనలో మార్పు ఎలా వచ్చిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది' అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రీతమ్, నిర్మాణం ఏ వన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, కథ, దర్శకత్వం: భాష్యం శ్రీనివాస్.హిందీలో ప్లాప్ అయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X