మగాళ్లందరూ మాయగాళ్లే!

By Staff

మగాళ్లు చెప్పే కల్లబొల్లి మాటలకు తానెప్పుడూ పడిపోనని, ఎవరో కొద్దిమందిని మినహాయిస్తే మగాళ్లంతా మాయగాళ్లేనని నొక్కి వక్కాణిస్తోంది 'జయం" సదా. 'జయం" 'అపరిచితుడు" వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాల్లో నటించిన సదాకు ఇటు తెలుగులో కాని, అటు తమిళంలో కాని- ఆ రెండు చిత్రాలు మినహా మరో చిత్రం విజయం సాధించకపోవడం వెలితిగా మిగిలిపోతోంది. చిత్రసీమలో పురుషాధిక్యత జాస్తి కనుక, సహజంగానే మగజాతిపై సదా నిప్పులు చెరుగుతోంది.

'మగ" అనే మాట వింటే చాలు మండిపడిపోతోంది. తనకు 'బోయ్‌ఫ్రెండ్‌" అనేవాడు ఎవడూ లేడని, అటువంటి టైమ్‌ వేస్ట్‌ పనులకు తాను చాలా దూరమని కూడా ఈ భామ చెబుతోంది. బోయ్ ఫ్రెండా? వెళ్ళవయ్యా వెళ్ళు అంటోంది. దాదాపు మగాళ్ళందరూ ఆడవాళ్ళని ట్రాప్ చేయటానికి ప్రయత్నిస్తారని ఈ ముద్దుగుమ్మ అంటోంది. అందుకే సాధ్యమైనంతవరకూ మగాళ్ళకి దూరంగా ఉంటానని, షూటింగ్కు ప్యాకప్ చెప్పగానే ఇంట్లో వాలిపోతానని వళ్ళిస్తోంది. కాగా, శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో తను తాజాగా నటించిన 'అఆఇఈ" చిత్రంపై ఈ అమ్మడు గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం 'జయం", 'అపరిచితుడు" చిత్రాల కోవలో ఘన విజయం సాధించి తన జాతకాన్ని మార్చేయడం ఖాయమని ఉవ్విళ్ళూరుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X