'అనసూయ, మంత్ర' తెలుగు పరిశ్రమను హీరోయిన్ ఓరియంటెడ్ థ్రిల్లర్స్ వైపు మళ్ళించాయి. దాంతో రకరకాల భాషల్లో ఉన్న ధ్రిల్లర్స్ మొత్తం డబ్బింగ్ అయి తెలుగు లోకి దూకబోతున్నాయి. ఆ వరసలో తాజాగా కన్నడంలో సక్సెస్ అయిన "Mohini 98857 38888" అనే సినిమా మోహిని పేరుతో డబ్బింగ్ అయి వస్తోంది. ఈ సినిమాకి యు.యస్.పి సదా. ఆమెది "వెళ్ళవయ్యా వెళ్ళు" అంటూ ప్రేక్షకులను ధియేటర్స్ వైపు లాగిన అందం. ఇప్పుడు ఆమె మోహిని గా అభిమానులను అలరిస్తుందన్నమాట. రాజేంద్రబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సస్పెన్స్ థ్రిల్లర్ పాటు నవరసాలు కూడా ఉంటాయిట. సదా ఇందులో క్రైమ్ రిపోర్టర్ గా కనపడుతుంది. కథలో 98857 38888 అనే సెల్ నెంబర్ నుండి కొంత మందికి కాల్స్ వస్తాయి. ఆ కాల్స్ అందుకున్న అందరూ వరసగా చచ్చిపోతూంటారు. ఎవరు ఈ కాల్స్ చేసి మరీ చంపుతున్నారు ...రీజన్ ఏంటి అనేది క్లైమాక్స్ లో తేలుతుంది. గోగినేని బాలకృష్ణ తన సెన్సేషనల్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేస్తున్నారట. మేడే రోజు ఈ చిత్రం థియేటర్లను పలకరించబోతోంది.