జానకి రామ్ మృతి: కొడుకును హీరోగా చూడకుండానే...
హైదరాబాద్: హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ మృతి నందమూరి కుటుంబంలో, అభిమానుల్లో విషాదం నింపింది. జానికి రామ్‌కు తాతగారంటే చాలా ఇష్టం. ఆయన ఫేస్ బుక్ నిండా తాత జ్ఞాపకాలతోనే నింపేసారు. అంతేకాకుండా తన కుమారుడికి కూడా తాత పేరే పెట్టుకున్నారు.
ఫ్యూచర్లో తన కుమారుడిని పెద్ద హీరోగా చూడాలనేది ఆయన ఆశ. ఇటీవలే తన కుమరుడిని బాలనటుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా కూడా ప్రారంభమైంది. శ్రీసాయి జగపతి పిక్చర్స్, సంతోష్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ‘దాన వీర శూర కర్ణ' పేరుతో సినిమా ప్రారంభించారు. జే.వి.ఆర్ దర్శకుడు. సి.హెచ్ వెంకటేశ్వరరావు, జె.బాలరాజు నిర్మాతలు.

ఒకప్పుడు ‘దాన వీర శూర కర్ణ' ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా పేరు పోగొట్టుకండా అన్ని జాగ్రత్తలు తీసుకుని బాలలతో దీన్ని రీమేక్ చేయడానికి ఏర్పాట్లు చేసారు.
ఈ సినిమాలో కృష్ణుడి పాత్ర కోసం నందమూరి జానకీరామ్ తనయుడు మాస్టర్ తారక రామారావు ఎంపిక చేసారు కూడా. తన జీవితంలోని అతి పెద్ద కోరిక తీరకుండానే జానకి రామ్....ఇలా మధ్యలోనే అందిరినీ విడిచి వెళ్లడం కుటుంబ సభ్యులను, అభిమానులను విషాదంలో ముంచేసింది.


Click it and Unblock the Notifications











