కమల్ హాసన్, కె.విశ్వనాధ్ కెరీర్ లో ప్రతిష్టాత్మక చిత్రం సాగరసంగమం ఓ హిందీ చిత్రం చూసి ప్రేరణ పొంది తీసిందేనంటున్నాడు కమల్ హాసన్ స్వయంగా. ప్రముఖ దర్శకుడు వి.శాంతారాం క్లాసిక్ జనక్ జనక్ పాయిల్ బాజే చిత్రం ఆధారంగా ఈ చిత్రం తయారు చేసామని ఆయన చెప్తున్నారు.ఈ విషయమై కమల్ మాట్లాడుతూ..నేను విశ్వనాధ్ ఇద్దరం శాంతారాం కి మంచి అభిమానులం. అందులోనూ జనక్ జనక్ పాయల్ బాజే అయితే ఇక ఇధ్దరకీ ప్రాణం. దాంతో ఇద్దరం దాన్ని ప్రేరణగా తీసుకున్నాం. అయితే నేను రీమేక్ చేద్దామన్నా. దాన్ని విశ్వనాధ్ రిజక్ట్ చేసారు. కొన్ని సినిమాలను రీమేక్ చేయలేం. మళ్లి సృష్ఠించాలంతే అన్నారు. అదే చేసాం..అందుకే అంత విజయం సాధించింది అన్నారు కమల్ తన తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ. ప్రసుతం ఆయన ఎ వెడ్నస్ డే చిత్రాన్ని ఈనాడు పేరుతో రీమేక్ చేస్తున్నారు. దాన్ని సాగరసంగమం చిత్రంలో భంగిమ కుర్రాడు చక్రి డైరక్ట్ చేస్తున్నాడు.
Story first published: Thursday, May 14, 2009, 11:22 [IST]