»   »  సూపర్ స్టార్ మద్దతుకోసం జయసుధ ఇలా (ఫోటో)

సూపర్ స్టార్ మద్దతుకోసం జయసుధ ఇలా (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సీనియర్ నటి జయసుధ ‘మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(మా) అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గెలుపు కోసం ఆమె తన శక్తిమేర ప్రయత్నిస్తోంది. ఈ నెల 29 ‘మా' ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఆర్టిస్టుల మద్దతు కోసం వారిని కలుస్తోంది. ఇందులో భాగంగా ఆమె శుక్రవారం ఉదయం సూపర్ స్టార్ కృష్ణ నివాసానికి వెళ్లి కలిసారు. అక్కడే అల్పాహారం చేసారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

శుక్రవారం సాయంత్ర ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జయసుధ మాట్లాడుతూ...‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికలు ఇంత దారుణంగా ఉంటాయని అనుకోలేదని వాపోయారు. మురళీ మోహన్ పోటీ చేయమంటేనే పోటీ చేస్తున్నాను, అలా అని ఆయన చెప్పినట్లే వింటాను అనుకోవద్దు అన్నారు.

 Sahaja Nati Jayasudha breakfast meet with Superstar

సినీ పరిశ్రమలో మంచి చెడూ నాకు తెలుసు, ప్రస్తుత రాజకీయాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అని వ్యాఖ్యానించారు. ఉన్న కళాకారుల్లో ఎవరికి ఏది అవసరమో అదే చేస్తాం, దొంగ హామీలు ఇవ్వం అని వ్యాఖ్యానించారు. అసోసియేషన్లొ అవకతవకలు ఎక్కడ జరిగాయన్నది తెలుసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. గెలిచిన తర్వాత ఇత చేస్తాను అంత చేయాలని చెప్పను. ఇదేమీ రాజకీయ ఫ్లాట్ ఫాం కాదు అన్నారు జయసుధ. సినీ పరిశ్రమలో పిల్లల పెళ్లిళ్లు చేయడానికి సహకరిస్తామన్నారు.

‘మా' ఎన్నికల కోసం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవాల్సిన పని లేదన్నారు. వివిధ ప్రాంతాల్లో కల్చరల్ పోగ్రాములు చేసి ఫండ్ కలెక్ట్ చేస్తామన్నారు. ‘మా' అసోసియేషన్ కోసం బిల్డింగు కంటే ముందు పెన్షన్లు, ఇన్సూరెన్సు, ఎమర్జెనీ వస్తే ఎంత మందికి హెల్ప్ చేయగలం అనే విషయాల గురించి ఆలోచిస్తామన్నారు. సినీ కార్మికుల కోసం గ్రీవెల్స్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. పేద కళాకారులకు సహాయం చేస్తాం. అసోసియేషన్ సభ్యుల్లో చిన్నా పెద్దా తేడా ఏమీ లేదన్నారు. నన్ను ఉద్దేశించి ఎగతాళి మాట్లాడుతున్నారు. నేనూ మాట్లాడగలను...నేను మాట్లాడటం మొదలు పెడితే చాలా మంది బాధ పడతారు. పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జయసుధపై నమ్మకం ఉంది, ఆమెలో కసి కనిపిస్తోంది....ఆమె ‘మా' అధ్యక్షకురాలిగా ఎన్నికయితే కళాకారులకు మంచి జరుగుతుందన్నారు.

English summary
Senior Actress Jayasudha who is in fray for the MAA President Post in the upcoming election scheduled to take place on March 29th went all the way to Superstar Krishna's House on Friday to seek much needed support to fight against Rajendra Prasad's panel.
Please Wait while comments are loading...