హాలీవుడ్ స్టూడియోను కొంటున్న ఇండియా సంస్ధ
ప్రఖ్యాతి చెందిన హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మెట్రో-గోల్డ్‌విన్ మేయర్ (ఎంజిఎం) ను సొంతం చేసుకోవటానికి సహారా ఇండియా పరివార్ సన్నాహాలు చేస్తోంది. అప్పుల్లో కూరుకుపోయిన ఎంజిఎంను కొనుగోలు చేయటానికి సహారా పరివార్ 200 కోట్ల బిడ్ ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. సహారా --ఎంజిఎం డీల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఈ రెండు కంపెనీల ఆసక్తులకు అనుగుణంగా కొనుగోలుకు సంబంధించి కొద్దికాలంగా చర్చలు సాగుతున్నాయని, ఈ అంశానికి సంబంధించి ఇంతకు మించి ఏమీ చెప్పలేమని సహారా ఇండియా అధికార అధికార ప్రతినిధి అభిజిత్ సర్కార్ చెప్పారు.మెట్రో-గోల్డ్‌విన్ మేయర్ ఇంక్ మోషన్ పిక్చర్, టెలివిజన్, హోమ్ వీడియో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా ఉంది. ఫైనాన్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, హౌజింగ్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, కన్జూమర్ ప్రొడక్ట్స్, మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, ట్రేడింగ్ బిజినెస్‌లలో సహారా ఇండియా పరివార్ కార్యకలాపాలు సాగిస్తోంది. ఇక ఈ విషయమై.. ఎంజిఎం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.ప్రస్తుతం ఎంజిఎంకు 400 కోట్ల డాలర్ల మేర అప్పులున్నాయి.


Click it and Unblock the Notifications











