గోపీచంద్ ‘సాహసం’ మూవీ టాకేంటి?
హైదరాబాద్ : వరుస ప్లాపులతో సతమవుతున్న హీరో గోపీచంద్ దాదాపు సంవత్సరన్నర గ్యాప్ తరువాత 'సాహసం' సినిమాతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో గోపీచంద్ సరసన తాప్సీ హీరోయిన్. గోపీచంద్ పెళ్లి తర్వాత వచ్చిన తొలి సినిమా కావడంతో సర్వత్రా చర్చనీయాంశం అయింది.
ఇప్పటికే సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తాజాగా బాక్సాఫీసు వద్ద నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా కథతో పాటు, సాహస సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉందని అంటున్నారు. అయితే సినిమాలో ఎంటర్టెన్మెంట్ పాళ్లు తగ్గాయని అంటున్నాన్నారు.
మొత్తానికి సినిమా ఫర్వాలేదు అనే విధంగా ఉందని అంటున్నారు. వరుస ప్లాపులతో ఉన్న గోపీచంద్‌కు ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ కాస్త ఊరట కలిగించే విషయమే అని చెప్పక తప్పదు. మరి ఫస్ట్ డే గడిస్తే గాని సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయం ఏమిటి? అనేది చెప్పలేం.
గోపీచంద్ సరసన తాప్సీ హీరోయిన్. శక్తికపూర్, అలీతోపాటుగా ప్రముఖ తారాగణమంతా నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: శ్యామ్‌దత్ ఎస్, సంగీతం: శ్రీ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: సెల్వ, మాటలు: కె.కె.రాధాకృష్ణకుమార్, పాటలు: అనంత్‌శ్రీరామ్, సహ నిర్మాత: బోగవల్లి బాపినీడు, నిర్మాత: ఛత్రపతి ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంద్రశేఖర్ ఏలేటి.


Click it and Unblock the Notifications











