గోపీచంద్ ‘సాహసం’ మళ్లీ వాయిదా
హైదరాబాద్ : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై గోపీచంద్ హీరోగా, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందిన 'సాహసం' చిత్రం జూన్ 21న విడుదల చేయాలని ఇటీవల నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈచిత్రం విడుదల మళ్లీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. జులై 5న ఈచిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ రోజు విడుదలైన 'సంథింగ్ సంథింగ్', 'సరదాగా అమ్మాయితో', వచ్చే వారం విడుదల కాబోతున్న అల్లరి నరేష్ 'యాక్షన్ 3డి', ఆ తర్వాత వారాల్లో రాబోతున్న రవితేజ 'బలుపు', కళ్యాణ్ రామ్ 'ఓం' విడుదల నేపథ్యంలో....థియేటర్ల సర్దుబాటులో భాగంగా 'సాహసం' చిత్రం జులై 5కు వాయిదా పడ్డట్లు తెలుస్తోంది.
యజ్ఞం, రణం, లక్ష్యం, శౌర్యం వంటి చిత్రాలలో నటించిన గోపీచంద్..... ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన చంద్రశేఖర్ ఏలేటి తొలి కలయికలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టెన్మెంట్ సమర్పణలో ఛత్రపతి ప్రసాద్ నిర్మించారు.
గోపీచంద్ సరసన తాప్సీ హీరోయిన్. శక్తికపూర్, అలీతోపాటుగా ప్రముఖ తారాగణమంతా నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: శ్యామ్‌దత్ ఎస్, సంగీతం: శ్రీ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: సెల్వ, మాటలు: కె.కె.రాధాకృష్ణకుమార్, పాటలు: అనంత్‌శ్రీరామ్, సహ నిర్మాత: బోగవల్లి బాపినీడు, నిర్మాత: ఛత్రపతి ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంద్రశేఖర్ ఏలేటి.


Click it and Unblock the Notifications











