twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సాహసం’ జూలై 12కు వాయిదా

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై గోపీచంద్ హీరోగా, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందిన 'సాహసం' చిత్రం జులై 12వ తేదీకి వాయిదా పడింది. తొలుత జులై 5న అనుకున్నారు. కానీ థియేటర్ల సమస్య కారణంగా సినిమాను జులై 12కు వాయిదా వేసారు.

    సాహసం మూవీ పీఆర్ఓ ఈ విషయాన్ని అఫీషియల్‌గా వెల్లడించారు. యజ్ఞం, రణం, లక్ష్యం, శౌర్యం వంటి చిత్రాలలో నటించిన గోపీచంద్..... ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన చంద్రశేఖర్ ఏలేటి తొలి కలయికలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టెన్మెంట్ సమర్పణలో ఛత్రపతి ప్రసాద్ నిర్మించారు.

    రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా చంద్రశేఖర్ బాణీలో ఉంటూనే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందిందని, ఇంతవరకూ ఎవరూ షూటింగ్ చేయని ప్రదేశాలలో ఈ షూటింగ్ చేశామని, తమ సంస్థకు ఓ మంచి విజయవంతమైన చిత్రంగా మారే ఈ సినిమా గోపీచంద్‌కు ల్యాండ్‌మార్క్ మూవీగా ఉంటుందని నిర్మాతలు అంటున్నారు.

    గోపీచంద్ సరసన తాప్సీ హీరోయిన్. శక్తికపూర్, అలీతోపాటుగా ప్రముఖ తారాగణమంతా నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: శ్యామ్‌దత్ ఎస్, సంగీతం: శ్రీ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: సెల్వ, మాటలు: కె.కె.రాధాకృష్ణకుమార్, పాటలు: అనంత్‌శ్రీరామ్, సహ నిర్మాత: బోగవల్లి బాపినీడు, నిర్మాత: ఛత్రపతి ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంద్రశేఖర్ ఏలేటి.

    English summary
    Gopichand, Tapsi starrer 'Sahasam' release postponed to July 12. The news was confirmed by the film’s PRO. The movie directed by Chandrasekhar Yeleti, BVSN Prasad produce this film on Sri Venkateswara Cine Chitra banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X