»   »  సాహసం శ్వాసగా.... ఇన్నాళ్ళూ చెప్పినవన్నీ అబద్దాలేనా? షూటింగ్ ఇంకా జరుగుతోంది

సాహసం శ్వాసగా.... ఇన్నాళ్ళూ చెప్పినవన్నీ అబద్దాలేనా? షూటింగ్ ఇంకా జరుగుతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

'సాహసం శ్వాసగా సాగిపో' ఏడాది కిందటే రావాల్సిన సినిమా. రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. జూన్లో ఆడియో విడుదల సందర్భంగా జులైలో సినిమా పక్కా అన్నారు. ఆ తర్వాత మూణ్నాలుగు డేట్లు మారిపోయాయి. సెప్టెంబరు కూడా సగం అయిపోవస్తోంది. ఇప్పటిదాకా రిలీజ్ సంగతి తేలలేదు. సినిమా ఎప్పుడో పూర్తయిపోయిందని.. వేరే కారణాల వల్ల వాయిదా పడుతోందని అంతా అనుకుంటూ వచ్చారు. కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం విశేషం. ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఈ సినిమా తమిళ వెర్షన్ కోసం ఓ పాట తీస్తున్నారు

ఎప్పుడో ఆర్నెల్ల కింద‌టే రిలీజ‌వ్వాల్సిన సినిమా 'సాహ‌సం శ్వాస‌గా సాగిపో'. ఐతే దీని త‌మిళ వెర్ష‌న్ షూటింగ్ హీరో.. కాంట్రవర్శీ కింగ్ శింంబు కార‌ణంగా ఆగిపోయింది. బీప్ సాంగ్ గొడవతో పాటు అనేక వివాదాల్లో చిక్కుకుని ఈ సినిమా షూటింగ్‌కు చాలాసార్లు డుమ్మా కొట్టాడు శింబు. స్వయంగా దర్శకుడు గౌతమ్ మీననే.. ఓ వేడుకలో శింబు వల్ల తాను పడుతున్న ఇబ్బంది గురించి ఆవేదన వ్యక్తం చేశాడు. తెలుగు-తమిళ వెర్షన్లకు ప్రతి సన్నివేశాన్ని ఒకే లొకేషన్లో తీయడం గౌతమ్‌ స్టయిల్.

Sahasam swasaga sagipo

తెలుగులో 'వెళ్లిపోమాకే'కు తమిళ వెర్షన్ అయిన.. 'తల్లిపోగాదే..' పాటను బ్యాంకాక్‌లో శింబు, మాంజిమా మోహన్‌ల మీద చిత్రీకరిస్తున్నాడట గౌతమ్ మీనన్. ఏవో ఆర్థిక కారణాల వల్లే సినిమా వాయిదా పడుతోందన్నది అవాస్తవమని.. శింబు పుణ్యమే ఈ ఆలస్యం అని మరోసారి రుజువైంది.'సాహసం శ్వాసగా సాగిపో' షూటింగ్ మొత్తం పూర్తయిందని.. మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ఓకే అంటే ఇక ఆడియో విడుదల చేయడమే ఆలస్యమని ప్రకటించాడు తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న కోన వెంకట్. ''సాహ‌సం శ్వాస‌గా సాగిపో క్లైమాక్స్ షూటింగ్ పూర్త‌య్యింది. ఆడియో రిలీజ్ చేయ‌డానికి రెహ‌మాన్ సార్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ సినిమా కోసం అంద‌రూ ఎంత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారో.. మేం కూడా అంతే ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నాం'' అని కోన ట్విట్ట‌ర్లో పేర్కొన్నాడు.

కానీ ఇప్పుడు వస్తున్న వార్తలు మాత్రం మరోలా ఉన్నాయి. ఇంకా తమిళ వెర్షన్ షూటింగ్ పూర్తి కాక పోవటమే తెలుగు వెర్షన్ మీదకూడా ప్రభావం చూపిస్తోంది. అయితే.. సాహసం శ్వాసగా సాగిపో లేట్ అవుతున్నా చైతూ ఏ మాత్రం టెన్షన్ పడ్డం లేదట. గౌతమ్ మీనన్ సినిమాలు ప్రతీసారి ఏదో ఒక ఇబ్బందుల్లో ఇరుక్కన్నా.. చివరకు రిజల్ట్ మాత్రం చాలా బాగా ఉంటుందని నమ్మతున్నాడు నాగ చైతన్య. తన కెరీర్ లో ఇదో బెస్ట్ మూవీగా నిలుస్తుందన్నది చైతూ నమ్మకం అట...

English summary
The smash hit number "Thalli pogathey" from filmmaker Gautham Vasudev Menon's upcoming Tamil-Telugu bilingual romantic drama "Accham Yenbathu Madamaiyada" will be shot in Bangkok over the weekend.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu