Don't Miss!
- Sports మా భారత క్రికెటర్లకు ఇంకా ఆ గతి పట్టలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- News సూర్య గోచారంతో మే 13వరకు ఈ రాశులకు సంపద వర్షం
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జెనీలియాకన్నా కార్ డ్రైవర్ తో అక్రమ సంభధమే బెస్ట్ అని..
ఈ శుక్రవారం..జెనీలియా తాజా చిత్రం ఫోర్స్ (ఘర్షణ రీమేక్)తో పాటే సాహెబ్ ..బిబి అవుర్...గ్యాంగస్టర్ చిత్రం విడుదలైంది. అయితే ఎంతో ప్రమోషన్ చేసి,ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఫోర్స్ చిత్రం కన్నా ఈ చిన్న హిందీ చిత్రానికే ప్రేక్షకుల స్పందన లభించింది. అలాగే క్రిటిక్స్ కూడా ఈ చిత్రానికే మంచి మార్కులు వేసారు. ఇంతకీ ఈ చిత్రం అవుట్ లైన్..తనని నెగ్లెట్ చేస్తున్న భర్త కి తెలియకుండా కార్ డ్రైవర్ తో అక్రమ సంభందం పెట్టుకునే ఓ గ్యాంగస్టర్ వైఫ్ కధ ఇది. మహీగిల్, రణదీప్ హుడ్ కాంబినేషన్ లో విడుదలైన ఈ చిత్రం విడుదలకు ముందే తన ప్రమోషన్ ట్రైలర్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి మంచి ఓపినింగ్స్ తెచ్చిపెట్టింది.
ఇక మొదటినుంచి ఈ చిత్రం ఓ సెక్స్ చిత్రంలా ప్రమోట్ చేయటం కలిసి వచ్చింది. అయితే విడుదలయ్యాక ఇది ఓ ఎడ్వంచర్ ప్రాజెక్టు అని దర్శకుడుని పొగుడుతున్నారు. మరో ప్రక్క ఫోర్స్ సినిమా కోసం జెనీలియా,జాన్ అబ్రహం టీవిల్లో ప్రమోషన్ లో పాల్గొంటున్నారు. జాన్ అబ్రహం ఓ బైక్ ని ఎత్తుకుని మరీ తన కండలు చూపి సినిమాని హిట్ చెయ్యాలని చూసాడు కానీ మినిమం ఓపినింగ్స్ కూడా రాబట్టలేకపోవటం విచిత్రం. తెలుగులోనూ ఘర్షణ సినిమా అంతంత మాత్రంగానే ఆడింది. హిందీలో ఇప్పుడు సౌత్ సినిమాల రీమేక్ ట్రెండ్ నడుస్తూండటంతో ఈ సినిమాని వదిలారు కానీ ఫలితం లేదు.