twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విడుదలకు ముందే ప్రభాస్ సెన్సేషన్.. తెలుగు సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డ్

    |

    ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్లుగా తన కొత్త సినిమా సాహూ తెరకెక్కుతోంది. బాహుబలి విజయంతో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోవడంతో పాటు ఆయన సినిమాల పట్ల జనాల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఆచితూచి సాహూ కథ ఎంచుకున్నారు. భారీ హంగులతో యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ నేపథ్యంలో మీకో సర్‌ప్రైజ్ అని ప్రకటించిన ప్రభాస్.. సాహూ కొత్త పోస్టర్‌ రిలీజ్ చేశారు.

    త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సాహో సినిమాలో కొత్త లుక్‌తో ఉన్న రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. ఆయన ఈ పోస్టర్ ని అలా విడుదల చేశారో లేదో నెటిజన్ల నుంచి ట్రెమెండెస్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది ఈ పోస్టర్. సీరియస్, స్టైలిష్ లుక్ లో ప్రభాస్ ని చూసి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఓ అంచనాకు వస్తున్నారు ఆయన అభిమానులు.

    Sahoo Official poster new record

    అయితే ఈ పోస్టర్ విడుదలైన 24 గంట‌ల్లోనే 7,84,600 లకు పైగా లైక్స్‌ను సొంతం చేసుకొని తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. సినిమా పోస్టర్ పరంగా హ్యూజ్ రెస్పాన్స్ సంపాదించుకున్న తొలి చిత్రం సాహో రికార్డు నెలకొల్పింది. దీంతో పోస్ట‌ర్‌కే ఇంత రేంజ్‌లో రియాక్ష‌న్ ఉంటే మ‌రి సినిమాకు ఏ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేష‌న్స్‌ ఉన్నాయో ఊహించుకోవ‌చ్చు. తెలుగు సినిమా చరిత్రలో ఓ పోస్టర్‌కి ఇంతటి స్పందన రావడం ఇదే తొలిసారి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 400 కోట్ల భారీ బడ్జెట్‌తో సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.భారీ అంచనాల నడుమ ఈ సినిమాను ఆగ‌స్ట్ 15న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Young rebal star Prabhas gave surprise to his fans. His new movie Saaho which is directed by sujeeth. This movie Official poster released by prabhas. Huze responce is came to this poster and its creates new record.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X