గందరగోళంలో సాహో, సైరా.. ప్రభాస్, చిరంజీవిది అదే సమస్య.. అయ్యో అలా జరిగితే?

Recommended Video

Sye Raa And Sahoo To Be Released Same Day? | Filmibeat Telugu

vటాలీవుడ్‌కు 2019 సంవత్సరం సంచలనాలకు వేదిక కాబోతున్నది. తెలుగు సినీ పరిశ్రమలో కనీవినీ ఎరుగని విధంగా రెండు భారీ బడ్జెట్ చిత్రాలు తెరపైన హల్‌చల్ చేయబోతున్నాయి. ఒకటి ప్రభాస్ నటించిన సాహో చిత్రం కాగా, రెండోది మెగాస్టార్ నటిస్తున్న సైరా నర్సింహారెడ్డి. ఈ రెండు చిత్రాలు జాతీయ స్థాయి చిత్రాలుగా రూపొందడం తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ కాబోతున్నాయనే వార్త సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇంతకీ ఈ రెండు చిత్రాల రిలీజ్ ఎప్పుడంటే..

బాహుబలి తర్వాత అదే రేంజ్‌లో

బాహుబలి తర్వాత అదే రేంజ్‌లో

బాహుబలి తర్వాత అదే స్థాయిలో ప్రభాస్ సాహో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. గత రెండు సంవత్సరాలుగా సినిమాను హాలీవుడ్ సినిమాకు మించిన స్థాయిలో రూపొందించేందుకు కష్టపడుతున్నాడు. సుమారు రూ.200 కోట్లకుపైగా బడ్జెట్‌తో భారీగా నిర్మిస్తున్నారు.

 ఆగస్టు 15న సాహో రిలీజ్

ఆగస్టు 15న సాహో రిలీజ్

ఇలా అత్యంత భారీ బడ్జెట్, సాంకేతిక అంశాలతో రూపొందుతున్న సాహో సినిమాను పకడ్బందీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సాహోను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

సైరాతో మెగాస్టార్ చిరంజీవి

సైరాతో మెగాస్టార్ చిరంజీవి

ఇక ఖైదీ నంబర్ 150 చిత్రంతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి భారీ విజయాన్నే అందుకొన్నాడు. ఖైదీ నంబర్ 150 చిత్రం రికార్డులను తిరగరాసింది. అయితే 151వ సినిమా కోసం చిరంజీవి చాలా సమయమే తీసుకొన్నాడు. చివరకు సైరా నర్సింహారెడ్డితో చిరంజీవి 2017 డిసెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లారు.

నిర్మాతగా మారిన రాంచరణ్

నిర్మాతగా మారిన రాంచరణ్

సైరా నర్సింహారెడ్డికి నిర్మాతగా మెగా పవర్‌స్టార్ రాంచరణ్ వ్యవహరిస్తున్నారు. బడ్జెట్ ఎంతైనా సరే లెక్క చేయను. కానీ సినిమా చరిత్ర సృష్టించే స్థాయిలో ఉండాలన్నదే నా సంకల్పం. అందుకోసం నేను ఖర్చుకు వెనుకాడను. బడ్జెట్‌ను పట్టించుకోను అని రాంచరణ్ స్పష్టం చేశాడు.

ఆగస్టు 15నే సైరా రిలీజ్

ఆగస్టు 15నే సైరా రిలీజ్

కొణిదెల ప్రొడక్షన్ వేసుకొన్న ప్లాన్ ప్రకారం సైరా నర్సింహరెడ్డి చిత్ర షూటింగ్ మే 2019లో పూర్తి అయ్యే అవకాశం ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేయాలని భావిస్తున్నారట. ఈ విషయం సినీవర్గాల్లో భారీ చర్చకు దారి తీసింది.

ఒకే రోజు ప్రభాస్, చిరంజీవి

ఒకే రోజు ప్రభాస్, చిరంజీవి

ఎందుకంటే సైరా, సాహో ఒకే రోజు తలపడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా అర్థం కాని విషయం. నిజంగా ఈ రెండు భారీ సినిమాలు ఆగస్టు 15నే రిలీజ్ చేస్తారా అనే ఇప్పటి వరకు అధికారికంగా తేలలేదు. కానీ జాతీయ మీడియాలో కూడా ఈ వార్త సంచలనంగా మారడం గమనార్హం.

 రెండు కథల్లో అదే.. అందుకే

రెండు కథల్లో అదే.. అందుకే

కానీ ఈ రెండు సినిమాల నేపథ్యంలో కొంత సారుప్యత ఉంటుంది. ఈ సినిమాల కథలో స్వాతంత్రోద్యమ పోరాటం ఉంటుంది. ఇప్పుడు అదే సమస్యగా మారింది. అందుకే ఈ సినిమాను ఆగస్టు 15న చేద్దామని అనుకొన్నారేమో అనే మాట ఇండస్ట్రీలో కొనసాగుతున్నది. కానీ సాహో, సైరా ఒకే రోజు విడుదల కాకుండానే చర్యలు తీసుకొంటారనేది ఓ వర్గం అభిప్రాయంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X