యాంకర్ ప్రదీప్‌ ఫండ్ రైజింగ్ ఈవెంట్, ఎంట్రీ ఫీజు రూ.100 మాత్రమే!

ప్రముఖ తెలుగు యాంకర్ ప్రదీప్, సహృదయ ఫౌండేషన్ వారు కలిసి డిసెంబర్ 16న ఒక ఫైండ్ రైజింగ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ యాంకర్ ప్రదీప్ ఒక వీడియో షేర్ చేశారు. హైదరాబాద్‌లోని ఒయాసిస్ స్కూల్‌లొ ఈ ఈవెంట్ జరకుగబోతున్నట్లు తెలుస్తోంది.

''నేను, సహృదయ ఫౌండేషస్ వారు కలిసి డిసెంబర్ 16న ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేద్దామనుకుంటున్నాం. మాకు తెలిసిన ఒక రెండు అనాధశరణాలయాలు ఉన్నాయి. అందులో ఉన్న పిల్లల చదువు, ఫుడ్, మెడికల్ ఎక్స్‌పెన్సెస్ కోసం ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేయాలనుకుంటున్నాం'' అని ప్రదీప్ తెలిపారు.

Sahrdaya foundation fundraising event with Anchor Pradeep

ఇందులో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఈ ఈవెంటులో పాల్గొనడానికి ఎంట్రీ ఫీజు రూ. 100 మాత్రమే. మీరు ఈ వెంటును చూడటమే కాకుండా మీరూ పెర్ఫార్మ్ చేయవచ్చు. సింగింగ్, మ్యూజిక్, డాన్స్, కామెడీ స్కిట్ ఇలా ఏదైనా చేయవచ్చు. అలా చేయాలనుకున్న వారి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 150 కలెక్ట్ చేస్తాం. దీని ద్వారా వచ్చే ప్రతి పెన్నీ ఆ పిల్లలకు ఉపయోగపడుతుందని ప్రదీప్ తెలిపారు.

ప్రదీప్ టీవీ షోస్ విషయానికొస్తే... అతడి రీసెంట్ టీవీ రియాల్టీ షో 'పెళ్లి చూపులు' పెద్ద ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులను ఈ షో ఆకట్టుకోలేక పోయింది. అయినప్పటికీ ఇతర ఎంటర్టెనింగ్ షోలతో ప్రదీప్ తెలుగు టీవీ రంగంలో నె.1 యాంకర్‌గా రాణిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X