ఏడుస్తూనే ఉన్నా, ఆయన మాటల వల్ల వారం నిద్రలేదు: ధన్సిక

కొంత కాలం క్రితం ఓ సినిమా ప్రమోషన్ సమావేశంలో, సీనియర్ నటుడు టి. రాజేందర్ తీరుపై ధన్సిక స్పందిస్తూ.. ఆయన ఆ రోజు ప్రవర్తించిన తీరు తనను ఇప్పటికీ కలవర పెడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.

Recommended Video

ఆ మాటలకి ఏడుస్తూనే ఉన్నా.. వారం నిద్రలేదు..!

కొంత కాలం క్రితం ఓ సినిమా ప్రమోషన్ కోసం ఏర్పాటు చేయబడిన మీడియా సమావేశంలో, సీనియర్ నటుడు టి. రాజేందర్ పాల్గొన్నారు. ఆ సినిమాలో నటించిన ధన్సిక ఆ వేదికపై మాట్లాడుతూ, ఆయన పేరును ప్రస్తావించలేదు. దాంతో ఆమె ధోరణి పట్ల ఆయన ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. "రజనీ సినిమాలో చేయగానే స్టార్ హీరోయిన్ అయిపోయావు .. నేనెలా కనిపిస్తానులే" అంటూ హేళనగా మాట్లాడారు.

టీ రాజేందర్

టీ రాజేందర్

ఇటీవల తమిళనాట సీనియర్ నటుడు దర్శకుడు టీ రాజేందర్, హీరోయిన్ ధన్సికల మధ్య జరిగిన ఆ వివాదం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ సినిమా వేడుకలతో తన పేరు ప్రస్తావించలేదంటూ రాజేందర్, ధన్సికను ఉద్దేశించి స్టేజ్ మీదే అవమానకరంగా మాట్లాడటం, ఆమె కన్నీరు పెట్టుకోవటంతో అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.

ధన్సికకు మద్ధతు

ధన్సికకు మద్ధతు

ఈ విషయంలో పలువురు తమిళ సినీ నటులు ధన్సికకు మద్ధతు తెలిపారు. ఆ సంఘటనను గురించి తాజాగా ధన్సిక స్పందించింది. చివరకు ధన్సిక అప్పటికప్పుడు స్పందించింది రాజేందర్ కు క్షమాపణలు చెప్పింది కూడా. అయినా.. ఆయన కూల్ కాలేదు. దీంతో.. అదొక వివాదంగా మారింది.

 ఇప్పటికీ కలవర పెడుతోందీ

ఇప్పటికీ కలవర పెడుతోందీ

ఆ వ్యవహారంపై నడిగర్ సంఘం తరఫు నుంచి నటుడు విశాల్ కూడా స్పందించాడు. ధన్సికను టీఆర్ క్షమించాల్సిందని విశాల్ అభిప్రాయపడ్డాడు. ఈ నేఫథ్యంలో టీఆర్ తీరుపై ధన్సిక స్పందిస్తూ.. ఆయన ఆ రోజు ప్రవర్తించిన తీరు తనను ఇప్పటికీ కలవర పెడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.

ఎంతో మనోవేదన

ఎంతో మనోవేదన

ఆ రోజున ఆయన చేసిన అవమానానికి తనకి వారం రోజులపాటు నిద్ర పట్టలేదనీ, ఆ సంఘటన తనని ఎంతో మనోవేదనకు గురిచేసిందని చెప్పింది. ఆయనకి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువంటారు. కానీ అలాంటి లక్షణం ఆయనలో ఒక్కటి కూడా తనకి కనిపించలేదని అంది.

మౌనంగా వుండిపోయాను

మౌనంగా వుండిపోయాను

అలాంటి మనస్తత్వం వున్న వాళ్లెవరూ అలా మాట్లాడరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆధ్యాత్మిక భావాలు తనలో ఎక్కువగా ఉండటం వలన మౌనంగా వుండిపోయానని చెప్పుకొచ్చింది. మొత్తానికి పాపం బాగానే హర్ట్ అయ్యినట్టుంది పాపం..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X