గర్భవతిగా అనసూయ.. అసలు ఇదంతా ఏంటో తెలుసుకోవాలి.. మెగా హీరో కామెంట్స్

అనసూయ ఎంత గొప్పగా నటిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపై క్షణం, రంగస్థలం లాంటి చిత్రాల్లో అద్భుతమైన నటనను ప్రదర్శించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. అయితే అనసూయకు మళ్లీ ఆ స్థాయి పాత్ర పడలేదు. మధ్యలో మీకు మాత్రమే చెప్తా అనే సినిమాలో నటించింది. కానీ అంతగా గుర్తింపు రాలేదు. అయితే మళ్లీ టాలీవుడ్ ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసేందుకు అనసూయ రెడీ అయింది.

లాక్డౌన్ నేపథ్యంలో..

లాక్డౌన్ నేపథ్యంలో..

కరోనా వైరస్, లాక్డౌన్ వంటివి ఎన్నో కథలకు పురుడో పోశాయి. కొత్త కొత్త కాన్సెప్ట్‌లు, కొత్త కథలు వచ్చేందుకు దోహదపడ్డాయి. దర్శక రచయితలు తమ ఆలోచనలకు పదును పెట్టేందుకు కావాల్సినంత సమయం దొరికింది. అలా లాక్డౌన్‌ నేపథ్యంలో రాబోతోన్న సినిమాలో అనసూయ మెయిన్ లీడ్‌గా నటిస్తోంది.

థాంక్యూ బ్రదర్..

థాంక్యూ బ్రదర్..

అయితే అనసూయ తన కొత్త సినిమాకు సంబంధించి గత వారంలో టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. టైటిల్ పోస్టర్, లోగోలోనే ఎన్నో క్లూస్ వదిలారు. లిఫ్ట్, జారి పడిన మాస్క్, టైటిల్‌ల్ లోగోలో ఓ మహిళ ప్రెగ్నెంట్‌గా ఉండటం వంటి వాటితో అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది.

పోస్టర్ వైరల్..

పోస్టర్ వైరల్..

అనసూయ కొత్త సినిమా పోస్టర్‌ను మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రిలీజ్ చేశాడు. ఈ ఫస్ట్ లుక్‌తో అనసూయ అందర్నీ షాక్‌కు గురి చేసింది. ముందుగా అనుకున్నట్టు అనసూయ గర్భవతిగా నటిస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో అనసూయ డీ గ్లామర్ లుక్‌లో బాగానే ఆకట్టుకుంటోంది.

Recommended Video

Allari Naresh Naandhi Movie Teaser
అసలు మ్యాటర్ ఏంటి..

అసలు మ్యాటర్ ఏంటి..

అనసూయ కొత్త సినిమా పోస్టర్ రిలీజ్ చేసిన సాయి ధరమ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ప్రియ, అభిలను పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. అసలు ఇదంతా ఏంటో అని తెలుసుకోవాలని ఆత్రుతగా ఉంది. రమేష్‌కు ఆల్ ది బెస్ట్. మీకు విజయం చేకూరాలి. మీ కష్టపడే తత్త్వానికి విజయం కచ్చితంగా వస్తుందని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X