twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీహరి చనిపోయాక దారుణంగా అన్నారు, రాంగ్ స్టెప్ అనిపించింది: సాయి ధరమ్ తేజ్

    By Bojja Kumar
    |

    సుప్రీమ్ స్టార్ సాయి ధరమ్ తేజ్ నటించిన 'జవాన్' మూవీ డిసెంబర్ 1న విడుదలవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో బిజీ బిజీగా గడుపుతున్నారు. సినిమాలు చేయడం తగ్గించి తన సొంత యూట్యూబ్ ఛానల్ మీద దృష్టి పెట్టిన దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా సాయి ధరమ్ తేజ్‌ను ఇంటర్వ్యూ చేశారు.

    పూర్తి ఇంటర్వ్యూ జవాన్ రిలీజ్ రోజు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ ఇంటర్వ్యూకు సంబంధించి ప్రోమో ఒకటి విడుదల చేశారు. ఈ ప్రోమోలో తమ్మారెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు సాయి ధరమ్ తేజ్.

    సుప్రీమ్ స్టార్ ఎలా అయ్యావయ్యా?

    సుప్రీమ్ స్టార్ ఎలా అయ్యావయ్యా?

    మీ మామయ్య చిరంజీవి వరుస హిట్లు కొట్టాడు కాబట్టి సుప్రీమ్ స్టార్ అయ్యాడు. నవ్వు సుప్రీమ్ ఎలా అయ్యావయ్యా? అంటూ తమ్మారెడ్డి సంధించిన ప్రశ్నకు సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ..... ‘సుప్రీమ్' సినిమా చేశాను కాబట్టి సుప్రీమ్ హీరో అయ్యాను అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు.

    అచ్చం చిరంజీవి జిరాక్స్ కాపీలా ఉన్నావ్

    అచ్చం చిరంజీవి జిరాక్స్ కాపీలా ఉన్నావ్

    నేను నిర్మాతగా చిరంజీవితో ‘కోతల రాయుడు' సినిమా చేస్తున్నపుడు చిరంజీవి ఎలా ఉండేవాడో.... నిన్ను చూస్తుంటే అచ్చం అలానే అనిపిస్తోంది. ఈ విషయం నేను చిరంజీవికి కూడా చెప్పాను. మొత్తం నీలాగే ఉన్నాడని, ముఖ్యంగా కళ్లు అయితే సేమ్ టు సేమ్ ఉన్నాయి అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

    దురదృష్టవంతుడు అన్నారు

    దురదృష్టవంతుడు అన్నారు

    ఫస్ట్ సినిమా(రేయ్) కమిటైనపుడు రెండేళ్లు ఆగిపోయింది. సినిమా పూర్తవుతుందో? లేదో? అనే టెన్షన్. ఆ రెండేళ్లు ఎలా ఉండేది నీ ఫీలింగ్? అని తమ్మారెడ్డి ప్రశ్నించగా..... అప్పుడు నన్ను మోస్ట్ అన్ లక్కీయెస్ట్ హీరో అన్నారు.... అని సాయి ధరమ్ తేజ్ తెలిపారు.

    శ్రీహరిగారు చనిపోవడంతో ఐరన్ లెగ్ అని విమర్శించారు

    శ్రీహరిగారు చనిపోవడంతో ఐరన్ లెగ్ అని విమర్శించారు

    ఓ వైపు ముందు మొదలైన ‘రేయ్' మూవీ ఆగిపోయింది. తర్వాత మొదలైన ‘పిల్లా నువ్వులేని జీవితం' సినిమా మొదలైన తర్వాత అందులో కీలకమైన పాత్ర చేస్తున్న శ్రీహరిగారు 2013లో చనిపోయారు. ఆ స్థానాన్ని జగపతి బాబుగారితో రీప్లేస్ చేసి మళ్లీ షూట్ చేసి 2014లో విడుదల చేశారు. శ్రీహరిగారు చనిపోయినపుడు పరిస్థితి చాలా దారుణంగా అనిపించింది. అసలు నేను కరెక్ట్ స్టెప్ తీసుకోలేదా? అనే ఆలోచనలో పడ్డాను. నన్ను అంతా ఐరన్ లెగ్ అంటూ ఆడేసుకున్నారు. జీవితం ఏంటి ఎక్కడికి వచ్చింది అనిపించింది... అని సాయి ధరమ్ తేజ్ గుర్తు చేసుకున్నారు.

    సినిమా హీరోలైన తర్వాత ఎందుకలా?

    సినిమా హీరోలైన తర్వాత ఎందుకలా?

    సినిమా హీరోలైన తర్వాత మనుషుల్లో ఒక ఛేంజ్ ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుంది? అనే ప్రశ్నకు సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.... వాళ్లు పెరిగిన పరిస్థితులను బట్టి ఉంటుంది అని సమాధానం ఇచ్చారు.

    రెజీనాతో పెళ్లి, ఒక అమ్మాయి గురించి ఎందుకలా రాయడం?

    రెజీనాతో పెళ్లి, ఒక అమ్మాయి గురించి ఎందుకలా రాయడం?

    రెజీనాను పెళ్లి చేసుకుంటున్నావని అంటున్నారు నిజమేనా? అనే ప్రశ్నకు సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ....పెళ్లయిపోయిందండీ.... అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. నా గురించి రాస్తే నేను పట్టించుకోను. కానీ ఒక అమ్మాయి గురించి అలా రాయడం మాత్రం బాధ అనిపిస్తుంటుంది అని తెలిపారు.

    మీ పెద్ద మామ ఇష్టమా? చిన్న మామ ఇష్టమా?

    మీ పెద్ద మామ ఇష్టమా? చిన్న మామ ఇష్టమా?

    నీకు మీ పెద్ద మామ అంటే ఇష్టమా? లేక చిన్నమామ అంటే ఇష్టమా? అనే ప్రశ్నకు సాయి ధరమ్ తేజ్ ఆచితూచి స్పందించారు. టీఆర్పీల కోసం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అవసరమా? అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. పూర్తి ఇంటర్వ్యూ రేపు విడుదల కానుంది.

    English summary
    Sai Dharam Tej About Chiranjeevi, Pawan Kalyan and JAWAAN Telugu Movie. Tammareddy Bharadwaj FACE to FACE Interview With Sai Dharam Tej Promo. In This Video, Sai Dharam Tej Reveals Shocking Facts About Tollywood Film Industry, talks about his Love for Chiranjeevi and Pawan Kalyan and the Struggles he Faced in his life To Reach This Position.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X