నేను ఆ సినిమా చేయటం లేదు, చరణ్ ఎన్టీఆర్ విషయం కూడా నమ్మొద్దు: సాయి ధరమ్ తేజ్
Recommended Video

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఓ మల్టీ స్టారర్ మూవీ రాబోతుందట.. గత కొన్నిరోజులుగా సినీ సర్కిల్‌లో ఇదే చర్చ. దీనికి కారణం రాజమౌళి ఎన్టీఆర్-తారక్‌లతో కలిసి దిగిన ఫోటో షేర్ చేయడమే. అయితే వీరి కాంబినేషన్‌లో అసలు మూవీ ఉంటుందా? లేక ఫోటోను బట్టి రకరకాల రూమర్స్ పుట్టుకొచ్చాయా? ఇలాంటి సందేహాలు మెగా అభిమానులతో పాటు.. ఎన్టీఆర్ అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.

సాయి ధరమ్ తేజ్
సినీ సర్కిల్‌లో హాట్ టాపిక్ మారిన ఎన్టీఆర్-రామ్ చరణ్ మల్టీస్టారర్ మూవీపై మెగా హీరో సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇస్తూ.. తాను కూడా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ మల్టీస్టారర్ అంటే రూమర్స్ మాత్రమే అనుకున్నానని అయితే అది నిజం అని తెలిసిన తరువాత చాలా థ్రిల్లింగ్‌గా ఉందంటూ మల్టీస్టారర్ మూవీపై ఉన్న రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అందులో ఒకటే సాయి ధరమ్ తేజ్ కూడా ఈ సినిమాలో ఒక పాత్ర చేయనున్నాడని...

జవాన్
సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'జవాన్'. ఈ సినిమా (డిసెంబర్ 1) ఈరోజున విడుదల కాబోతున్న సందర్భంగా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నాడు సాయిధరమ్ తేజ్. ఇందులో భాగంగా ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సినిమాకి సంబంధించిన వివరాలే కాకుండా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలిస్తూ తనకు సంబందించిన మరికొన్ని ముఖ్య విషయాలను పంచుకున్నాడు.

డిఫరెంట్ లుక్‌లో
తాను ప్రస్తుతం వీవీ వినాయక్, కరుణాకరన్ దర్శకత్వాల్లో రెండు విభిన్న తరహా సినిమాలు చేస్తున్నానని, ప్రేమకథలుగా రూపొందుతున్న ఈ రెండిటిలో కూడా ఇంతకుముందెన్నడూ కనిపించని డిఫరెంట్ లుక్‌లో దర్శనమీయనున్నానని చెప్పుకొచ్చాడు.

గ్యాంగ్ లీడర్
తాను 'గ్యాంగ్ లీడర్' సినిమాను రీమేక్ చేయబోతున్నాని, మహేష్‌బాబు తో ఓ సినిమాలో నటించబోతున్నానని, ఎన్టీఆర్-చెర్రీ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పాడు. అయితే మంచి కథ దొరికితే మాత్రం ఏ హీరోతోనైనా మల్టీస్టారర్ చేయడానికి సిద్దమే.. అని చెప్పుకొచ్చాడు సాయిధరమ్.


Click it and Unblock the Notifications











