చెర్రీ, ఎన్టీఆర్‌లతో రాజమౌళి.... ఆ ఫోటో వెనక గుట్టు విప్పిన సాయి ధరమ్ తేజ్
రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ కలిసి దిగిన ఫోటో విషయంలో సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. త్వరలో ఈ ముగ్గురి కాంబినేషన్లో సినిమా రాబోతోందని సాయి ధరమ్ తేజ్ తెలిపారు.
బాహుబలి ప్రాజెక్టు తర్వాత రాజమౌళి ఏ సినిమా చేస్తున్నారు? ఎవరితో చేస్తున్నారు? అనే విషయంమై అందరిలోనూ ఆసక్తి ఉంది. ఇలాంటి తరుణంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో కలిసి దిగిన ఫోటో రాజమౌళి కొన్ని రోజుల క్రితం ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేయడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
వెంటనే మీడియాలో ఈ ముగ్గురి కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా రాబోతోందనే ప్రచారం మొదలైంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. అయితే తొలిసారి ఈ విషయమై ఓ క్లారిటీ వచ్చింది. అది కూడా మెగా ఫ్యామిలీ హీరో నుండే రావడం గమనార్హం.

ముందు సరదాగా తీసుకున్న ఫొటో అని అనుకున్నా
తన జవాన్ మూవీ ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్..... రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ కలిసి దిగిన ఫోటో గురించి స్పందించారు. ముందు సరదాగా తీసుకున్న ఫొటో అని అనుకున్నా, కానీ అసలు విషయం తెలిసి ఎగ్జైట్ అయ్యాను అని సాయి ధరమ్ తేజ్ తెలిపారు.

నా ఫ్రెండ్ ఫోన్ చేసిన తర్వాత విషయం ఆరా తీశాను
ఈ ఫోటో విషయమై నా స్నేహితుడు ఫోన్ చేసి ఆ ఫొటో చూశావా? అని అడిగాడు. ఏదో ఫంక్షన్‌లో మీట్ అయినట్లు ఉన్నారు అప్పుడు తీసుకున్నట్టున్నారు" అన్నాను. కానీ వాడు "లేదురా అబ్బాయ్.. ప్రాజెక్ట్ అంట" అని చెప్పడంతో నేను కూడా ఎగ్జైట్ అయ్యాను, వెంటనే ఈ విషయమై ఆరా తీశాను అని సాయి ధరమ్ తేజ్ తెలిపారు.

అటునుంచి సమాధానం విని చాలా ఎగ్జైట్ అయ్యాను.
మా ఫ్రెండ్ ఆ విషయం చెప్పగానే ఉత్కంఠ ఆపుకోలేక ఫోన్ చేశాను. దీంతో అటునుంచి సమాధానం విని చాలా ఎగ్జయిట్ అయ్యాను. అసలు ఊహించలేదు. ఎందుకంటే గొప్ప దర్శకుడు టాలీవుడ్ ఇద్దరు బిగ్ స్టార్ లతో సినిమా చేయడం అంటే ఊహించగలమా? దీంతో రియల్లీ చాలా ఎగ్జయిట్ అయ్యాను.... అని సాయి ధరమ్ తేజ్ తెలిపారు.

అభిమానుల్లో ఆనందం
స్వయంగా సాయి ధరమ్ తేజ్ ఈ విషయమై క్లారిటీ ఇవ్వడంతో అటు మెగా అభిమానులు, ఇటు ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











