రీమేక్ సాంగ్స్‌కే కొడుతున్నారు.. ఇప్పుడు మావయ్య సినిమా రీమేకా, వద్దు అంటున్న తేజు!
Recommended Video

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన తేజ్ ఐ లవ్ యు చిత్రం ఈనెల 6 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తొలిసారి సాయిధరమ్ తేజ్ నటించిన పూర్తిస్థాయి రొమాంటిక్ ప్రేమకథాచిత్రం ఇది. ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కంప్లీట్ పాజిటివ్ బజ్ తో ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. అనుపమ పరమేశ్వరన్, సాయిధరమ్ తేజ్ ఈ చిత్రంలో జంటగా నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి సినిమాల రీమేక్ గురించి తన మనసులో మాట బయట పెట్టాడు.

తొలిప్రేమ ఫ్లేవర్
తేజ్ ఐ లవ్ యు చిత్రాన్ని తొలిప్రేమ చిత్రంతో పోల్చలేమని సాయిధరమ్ తేజ్ తెలిపాడు. కానీ ఆ ఫ్లేవర్ మాత్రం ఉంటుందని వివరించాడు. తొలిప్రేమ చిత్రం ట్రెండ్ సెట్ చేసిన చిత్రం అని తెలిపాడు.

కొడుతున్నారు
ఇంటర్వ్యూలో సాయిధరమ్ తేజ్ కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మెగాస్టార్ చిత్రాలలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ఉందని తేజుని అడిగారు. తేజు ఈ ప్రశ్నకు ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. రీమేక్ సాంగ్స్ చేస్తేనే కొడుతున్నారు. ఇప్పుడు రీమేక్ వద్దండి అంటూ సమాధానం ఇచ్చాడు.

ఒక వేళ చేస్తే
కానీ రీమేక్ సినిమా చేయాల్సి వస్తే చంటబ్బాయ్ చిత్రాన్ని ఎంచుకుంటానని తేజు తెలిపాడు. ఆ చిత్రం తనకు చాలా ఇష్టమని సాయిధరమ్ తేజ్ వివరించాడు.

కరుణాకరన్ దర్శకత్వంలో
సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా ఈ చిత్రాన్ని ప్రేమ కథా చిత్రాల దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించారు. మెగాస్టార్ చిరుతో ఛాలెంజ్ వంటి సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన కె ఎస్ రామారావు ఈ చిత్రానికి నిర్మాత.


Click it and Unblock the Notifications











