Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
సోలో బ్రతుకే సో బెటర్ షూటింగ్ పూర్తి.. సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా షూటింగ్ పూర్తైయింది. ఈ మేరకు చిత్రయూనిట్ ఎంతో సంతోషంగా చివరి రోజు వీడ్కోలు పలికింది. అందరూ ఈ సినిమాతో ఉన్న జర్నీ, ఎమోషన్‌ను పంచుకున్నారు. ఈ మేరకు సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ప్రయాణంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. సుప్రీమ్ హీరో చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
రెండ్రోజులు క్రితమే సాయి ధరమ్ తేజ్ తన మేకప్మేన్లతో దిగిన ఫోటోను షేర్ చేశాడు. ఇది కొత్తది సాధారణమైన పోస్ట్ కోవిడ్ 19లో షూటింగ్.. షూటింగ్ లైఫ్ ఇలా ఉంటుంది.. ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ షూటింగ్లో ఉన్నాను.. కొత్త పద్దతులు.. కొత్తదే కానీ రొటీన్ అంటూ తన బాధను, సంతోషాన్ని తెలియజేశాడు. ఇక నేడు సినిమా షూటింగ్ పూర్తయిందని ఓ అందమైన ప్రయాణం ముగిసిందని ఎమోషనల్ అయ్యాడు.
ఎంతో సరదాగా, సంతోషాలతో నిండిన ప్రయాణాం ముగిసింది. సరదా సరదాగా సాగిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా షూటింట్ పూర్తయింది. సెట్ మీద ఏ ఒక్క రోజు కూడా డల్ మూమెంట్ లేదు. మాస్క్ వేసుకుని షూటింగ్ చేసిన సందర్భాలైనా సరే.. మాస్క్ ధరించకుండా చేసిన సందర్భాలైనా సరే.. అంతా సరదాగా గడిచిందంటూ సాయి ధరమ్ తేజ్ యూనిట్‌తో దిగిన ఫోటోను షేర్ చేశాడు.