9 నెలలుగా మెగా వీరాభిమాని నిరీక్షణ.. చివరకు కోరిక తీర్చిన మెగా హీరో

తెలుగు ప్రేక్షకులు హీరోలనే వెండితెర ఇలవేల్పులుగా కొలుస్తారు. హీరోలు కూడా ప్రేక్షకులను అభిమాన దేవుళ్లుగా ప్రేమిస్తారు. కొంతమంది అభిమానులు మాత్రం మిగతా వారికంటే భిన్నంగా ఉంటారు. వారింట్లో జరగాల్సిన వేడుకులను వారి అభిమాన హీరో చేతులమీదుగా జరిపించాలని కోరుకుంటారు. తాజాగా తమ కూతురుకు నామకరణం చేయాల్సిందిగా ఓ అభిమాని మెగా హీరోను ఆశ్రయించాడు.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు..

గతంలో కూడా ఇలాంటి ఘటనలు..

గతంలో కూడా ఓ అభిమాని.. చిరంజీవి ఫోటోను పెట్టుకుని పెళ్లి చేసుకున్నాడు. మరో అభిమాని తమ కూతురుకు పేరు పెట్టాలని చిరంజీవిని కోరారు. ఇలా అభిమానులు తమ ఆరాధ్య దైవంపై ప్రేమను కనబరుస్తుంటారు. అభిమానుల్లో మెగా ఫ్యాన్స్‌ ప్రత్యేకమన్నది వేరే చెప్పాల్సిన పనిలేదు.

తాజాగా సాయి ధరమ్‌ తేజ్‌ వద్దకు..

తాజాగా సాయి ధరమ్‌ తేజ్‌ వద్దకు..

తాజాగా సుప్రీం హీరో సాయి ధరమ్‌తేజ్‌ వద్దకు ఓ అభిమాని వచ్చాడు. తమ కూతురుకు నామకరణం చేయాల్సిందిగా.. వారు కోరారు. అయితే మెగా ఫ్యామిలీకి కలిసి వచ్చే తేజ్‌ అనే పదాన్ని జోడిస్తూ.. తేజన్విత అనే చక్కని పేరును పెట్టాడు. అయితే తమ కూతురుకు సాయి ధరమ్‌ తేజ్‌తో పేరు పెట్టించేందుకు తొమ్మిది నెలల పాటు అతను నిరీక్షించాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

 గతంలో కూడా సాయి ధరమ్ తేజ్

గతంలో కూడా సాయి ధరమ్ తేజ్

గతంలోనూ సాయి ధరమ్ తేజ్ చేసిన సహాయం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఓ సంగీత దర్శకుడు రోడ్డుపై గాయపడితే తేజ్ స్పందించి హాస్పిటల్‌కు చేర్చడంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా అభిమాని కోరిక తీర్చడంపై కూడా మెగా అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ప్రతిరోజు పండగే మూవీతో బిజీ

ప్రతిరోజు పండగే మూవీతో బిజీ

ఇక చిత్రలహరి సినిమాతో హిట్‌ట్రాక్‌లోకి వచ్చిన సాయి ధరమ్‌ తేజ్‌.. కథలను ఎంచుకునే పద్దతి మార్చుకున్నట్లు కనిపిస్తోంది. మాస్‌ జపం పటించిన ఈ మెగాహీరో ప్రస్తుతం క్లాస్‌ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ హీరో ప్రస్తుతం మారుతి దర్శకత్వం ప్రతిరోజూ పండగే అనే మూవీని చేస్తున్నాడు. రీసెంట్‌గా విడుదల చేసిన ప్రోమో కూడా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X