హీరో మీద చెయ్యి వేసిన హీరోయిన్.. హాత్ నికాలో అంటూ సూచన.. దర్శకుడి కౌంటర్
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. ఈ మధ్య ఫుల్ జోష్ మీదున్నాడు. వరుస పరాజయాల తరువాత చిత్రలహరితో హిట్ కొట్టి..కెరీర్‌ను గాడిలో పెట్టేసుకున్నాడు. మాస్ మంత్రం జపిస్తూ ఉంటే కష్టమని భావించిన మెగా హీరో.. ఓ చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రతి రోజు పండగేతో రాబోతోన్నాడు. అది కూడా మారుతి లాంటి హాస్య దర్శకుడితో. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, పాటలతో ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసిన చిత్రబృందం నేడు ఓ లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది.

రాశీ ఖన్నా పుట్టినరోజు..
ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్‌ను ఆట పట్టించే మరదలి పాత్రలో నటిస్తోన్న రాశీ ఖన్నా పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ భారీగానే సెలెబ్రేట్ చేసినట్టు తెలుస్తోంది. రాశీ ఖన్నా పుట్టిన రోజును పురస్కరించుకుని తకిట తకిట అనే లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.
వెరైటీ విషెస్..
రాశీఖన్నా పుట్టినరోజు సందర్భంగా ఈ హీరో బర్త్ డే విషెస్ తెలుపుతూ ఆమెపై ఒక పంచ్ వేశాడు. ‘జన్మదిన శుభాకాంక్షలు రాశీ ఖన్నా జీ. ముందు చెయ్యి తియ్యి అమ్మా. మీ ఫ్యాన్స్ నాపై అరుస్తున్నారు #హాథ్ నికాలో #చెయ్యి తీ #సోలో బ్రతుకే సో బెటర్' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫోటోలో తేజు చేతిని రాశి ప్రేమగా పట్టుకుని ఉండగా.. మెగా హీరో చేసిన కామెంట్ అందర్నీ ఆకర్షించింది.

తదుపరి చిత్ర ప్రమోషన్..
రాశీ ఖన్నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నట్టే చెప్పి.. నెక్స్ట్ సినిమా ప్రమోషన్‌ను కూడా కానిచ్చేశాడు. సాయి ధరమ్ తేజ్.. సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రం చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఈ సీన్‌లోకి దర్శకుడు మారుతి ఎంటర్ అవ్వడంతో సీన్ రివర్స్ అయింది.

చేయి వేసింది ఎవరు డార్లింగ్..
ప్రతి రోజు పండగే మూవీ ప్రమోషన్‌లో భాగంగా.. హీరో హీరోయిన్లు ఒకరినొకరు పట్టుకుని ఉన్న ఫోటోలను మారుతి షేర్ చేస్తూ.. "ఇక్కడ చెయ్యి వేసింది ఎవరు డార్లింగ్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య మంచి కెమెస్ట్రీ ఉండబోతోందన్న విషయం ఆ పిక్స్‌ను చూస్తేనే తెలుస్తోంది.

అదిరిపోయే కౌంటర్ వేసిన హీరో..
మారుతి వేసిన కౌంటర్‌కు సాయి ధరమ్ తేజ్ రిప్లై ఇస్తూ.. మీరు యాక్షన్ చెప్పారు నేను చెయ్యి వేశాను అండీ అని అన్నాడు. మరి ఇంత జరుగుతున్న రాశీ ఖన్నా మాత్రం ఇంకా ఎంటర్ అవ్వలేదు. పుట్టిన రోజు కాబట్టి ఫుల్ బిజీగా ఉందేమో. మరి వీటిపై రాశీ ఎలా స్పందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











