Sai Dharam Tej: ఆగిపోయిన మెగా మేనల్లుడి సినిమా గాంజా శంకర్.. కారణం ఏంటంటే?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించగల సత్తా ఉన్న ఈ కుర్రాడు.. గతేడాది విరూపాక్ష సినిమాతో వచ్చి బ్లాక్ బస్టరి హిట్టు కొట్టాడు. ఆ తర్వాత బ్రో సినిమాలోనూ నటించి మంచి మార్కులు కొట్టేశాడు. అయితే ఆ తర్వాత నుంచి ఆయన నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే ఇప్పటికే లాక్ చేసుకున్న ఓ సినిమా ఇప్పుడు మధ్యలో ఆగిపోయింది. టైటిల్ కూడా ప్రకటించగా.. ఎందుకు ఆగిపోయిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2014లో పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టాడు యంగ్ అండ్ డైనమిక్ హీరో సాయి ధరమ్ తేజ్. మెగా మేనల్లుడిగానే టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిప్పటికీ తన టాలెంట్, నటనతోనే ఎక్కువ క్రేజ్ సంపాధించుకోగలిగాడు. మొదటి సినిమాతో హిట్టు కొట్టిన ఈయన ఆ తర్వాత ఏడాది రేయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాలతో అలరించాడు. ఆ తర్వాత సుప్రీమ్, తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్ వంటి సినిమాలు కూడా చేశాడు.

అవి మాత్రమే కాకుండా ఇంటెలిజెంట్, తేజ్ ఐ లవ్ యూ, ప్రతిరోజూ పండగే, చిత్రలహరి, సోలో బ్రతుకే సో బెటర్, రిపబ్లిక్, విరూపాక్ష, బ్రో సినిమాలు చేశాడు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎప్పుడూ సరికొత్త కథలతో మన ముందుకు వచ్చే సాయి ధరమ్ తేజ్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా సంపతి నంది దర్శకత్వంలో ఈ సినిమాను లాక్ చేసుకున్నాడు.
అయితే సంపత్ నంది, సాయి ధరమ్ తేజ్ కాంబో సినిమాకు గాంజా శంకర్ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. అయితే తాజా వివరాలు ప్రకారం ఈ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం బడ్జెట్ సమస్యలే అని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఆర్థిక సమస్యల కారణంగా ఆ సినిమాను ఆపేయాలని నిర్ణయించుకున్నారట. అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించకపోయినప్పటికీ.. త్వరలోనే ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ తో పాటు మెగా అభిమానులు కూడా తెగ నిరాశ పడిపోతున్నారు. ఇదేంటి ఇలా జరిగిందంటూ తలలు పట్టుకుంటున్నారు. ఇది కాకపోయినా మరో అద్భుతమైన సినిమాతో సాయి ధరమ్ తేజ్ రావాలని కోరుకుంటున్నట్లు వివరిస్తున్నారు. మరి మెగా మేనల్లుడు నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











