‘తేజ్ ఐ లవ్ యూ’ టీజర్: సాయి ధరమ్ తేజ్, అనుపమ జోడీ అదుర్స్

By Bojja Kumar

సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'తేజ్ ఐ లవ్ యూ'. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ మధ్య జరిగే చిన్న రొమాంటిక్ సీన్‌తో దీన్ని డిజైన్ చేశారు. టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది.

నవతరం ప్రేమికుడిగా సాయిధరమ్‌తేజ్ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని, ఇప్పటివరకు ఆయన చేయనటువంటి విలక్షణ ప్రేమకథాంశమని, అనుపమ పరమేశ్వరన్ అందంతో పాటు చక్కటి అభినయంతో ఆకట్టుకుంటుంది నిర్మాత వెల్లడించారు.

Sai Dharam Tej, Anupama Parameswarans Tej I Love You’ Teaser

సినిమాను క్యూట్ అండ్ క‌ల‌ర్‌ఫుల్ ల‌వ్‌స్టోరీగా రూపొందిస్తున్నామని, ఇదొక మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ అని దర్శకుడు కరుణాకరన్ తెలిపారు. తాను తీసిన తొలిప్రేమ‌, ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాల స్టైల్‌లోనే ఈ సినిమా ఉంటుందని తెలిపారు.

సాయిధ‌ర‌మ్ తేజ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, జ‌య‌ప్రకాశ్‌, ప‌విత్రా లోకేశ్‌, పృథ్వీ, సురేఖా వాణి, వైవా హ‌ర్ష‌, జోష్ ర‌వి, అరుణ్ కుమార్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి లిరిక్స్: చ‌ంద్ర‌బోస్‌, రామ‌జోగ‌య్య‌శాస్త్రి, పోతుల ర‌వికిర‌ణ్, గోశాల రాంబాబు, స్టంట్స్: వెంక‌ట్‌, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: స‌తీశ్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: మోహ‌న్‌, చీఫ్ కో డైరెక్ట‌ర్: చ‌ల‌సాని రామారావు, ఎడిట‌ర్: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌, ఆర్ట్‌: సాహి సురేశ్‌, సంగీతం: గోపీ సుంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీ: అండ్రూ.ఐ, మాటలు: డార్లింగ్ స్వామి, స‌హ నిర్మాత‌: అలెగ్జాండ‌ర్ వ‌ల్ల‌భ‌, నిర్మాత‌: కె.ఎస్‌.రామారావు, క‌థ‌, స్క్రీన్‌ప్లే, దర్శ‌క‌త్వం: ఎ.క‌రుణాక‌ర‌న్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X