పెద్ద మనసు చాటుకుంటున్న మెగా హీరో.. దివ్యాంగుల కోసం...

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఎట్టకేలకు విజయాల బాట పట్టాడు. సుప్రీం చిత్రం తర్వాత వరుసగా 6 పరాజయాలతో సాయిధరమ్ తేజ్ కెరీర్ జోరు బాగా తగ్గింది. ఒక్క హిట్ కోసం తేజు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎట్టకేలకు సాయిధరమ్ తేజ్ ప్రయత్నాలు ఫలించి చిత్రలహరి చిత్రంతో మంచి విజయం సొంతం చేసుకున్నాడు. దీనితో సాయిధరమ్ తేజ్ ఉత్సాహంగా తన కొత్త చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉండగా సాయిధరమ్ తేజ్ తాజాగా దివంగులైన చిన్న పిల్లల కోసం చేసిన ఓ ఆలోచన ప్రశంసలు దక్కించుకుంటోంది.

 పిల్లల నుంచి పెద్దల వరకు

పిల్లల నుంచి పెద్దల వరకు

అవెంజర్స్.. ప్రస్తుతం ఈ పేరు మోత మోగిపోతోంది. కొన్ని రోజుల క్రితం మర్వెల్ సూపర్ హీరోల చివరి ప్రాంచైజీ అవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. వరల్డ్ వైడ్ గా అవెంజర్స్ చిత్రం క్రియేట్ చేస్తున్న కలెక్షన్ల రికార్డులు చూసి ట్రేడ్ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. ప్రాంతీయ భాషా చిత్రాలు ప్రభావం ఎక్కువగా ఉండే ఇండియాలో సైతం అవెంజర్స్ చిత్రం మతిపోగొట్టేలా వసూళ్లు రాబడుతోంది. సూపర్ హీరోల అవెంజర్స్ చిత్రానికి పిల్లల నుంచి పెద్దల వరకు అంతా అభిమానులే.

సాయి ధరమ్ తేజ్ మరోసారి

సాయి ధరమ్ తేజ్ మరోసారి

సాయిధరమ్ తేజ్ మరోమారు తన పెద్ద మనసు చాటుకుంటున్నాడు. తేజు ఎప్పుడూ అభిమానులకు చేరువగా ఉండేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి సాయిధరమ్ తేజ్ దివ్యాంగులైన చిన్న పిల్లల కోసం చేస్తున్న ఓ పనికి ప్రశంసలు దక్కుతున్నాయి. సాయిధరమ్ తేజ్ దివ్యాంగులైన పిల్లల కోసం మే 1న హైదరాబాద్ లో అవెంజర్స్ ఎండ్ గేమ్ ప్రత్యేక షోని ఏర్పాటు చేస్తున్నాడట. కొంతమంది అనాదశరణాలయంలో ఉండే పిల్లలకు ఈ స్పెషల్ షో ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లని తేజు చూసుకుంటున్నాడట.

మంచి విజయం

మంచి విజయం

ఇదిలా ఉండగా కిషోర్ తిరుమల దర్శత్వంలో తెరకెక్కిన చిత్రలహరి చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. సుప్రీం చిత్రం తర్వాత బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరిచిన తేజు చిత్రం ఇదే. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేద పెతురాజ్ నటించారు. పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

నెక్స్ట్ మూవీ ఎవరితో

నెక్స్ట్ మూవీ ఎవరితో

చిత్రలహరి తర్వాత తేజు నటించే చిత్రం గురించి ఆసక్తి నెలకొంది. సాయిధరమ్ తేజ్ తదుపరి చిత్రం వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతితో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఓ క్రేజీ బ్యానర్ లో తేజు నటించేందుకు కూడా సన్నాహకాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిత్రలహరి చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X