Sai Dharam Tej Accident పై పవన్ కల్యాణ్ స్పందన.. మేనల్లుడి గురించి పవర్ స్టార్ ఏం చెప్పారంటే

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లోని దుర్గం చెరువు వద్ద ఉన్న కేబుల్ బ్రిడ్జికి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకొన్నది. అయితే ప్రమాద స్థలంలో సాయిధరమ్ తేజ్‌ను గుర్తించి మెడికవర్ హాస్పిటల్‌లో చేర్పించారు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

అపోల్ హాస్పిటల్‌కు తరలింపు

అపోల్ హాస్పిటల్‌కు తరలింపు

సాయిధరమ్ తేజ్ అతివేగంగా ప్రయాణించడం వల్లే ప్రమాదం చోటు చేసుకొన్నది అని పోలీసులు వెల్లడించారు. ఆయనను తొలుత మెడికవర్ హాస్పిటల్‌లో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అపోలో హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాద వార్త తెలియగానే పవన్ కల్యాణ్ వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు.

కంటికి, ఛాతికి, కడుపులో గాయాలు

కంటికి, ఛాతికి, కడుపులో గాయాలు

సాయిధరమ్ తేజ్‌కు బలమైన గాయాలు తగిలాయని ప్రాథమిక సమాచారం. ఛాతి ఎడమవైపు బలమైన గాయం కావడంతో అక్కడ కమిలిపోయింది. కుడి కంటికి తీవ్రగాయమైంది. అలాగే కడుపులో కూడా బలంగా గాయం తగిలినట్టు తెలిసింది. భుజానికి సంబంధించిన ఎముక విరిగింది. మెడకు కూడా బలమైన గాయం తగిలినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్టు తెలిసింది.

హాస్పిటల్‌లో వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్

హాస్పిటల్‌లో వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్

సాయిధరమ్ తేజ్ ప్రమాద వార్త వినగానే ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్‌కు వచ్చారు. పవన్ కల్యాణ్‌తోపాటు వరుణ్ తేజ్, చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత, సాయిధరమ్ తేజ్ సోదరుడు, ఉప్పెన హీరో పంజా వైష్ణవ్ కూడా హాస్పిటల్‌కు చేరుకొన్నారు.

Recommended Video

Bheemla Nayak Singer Mogulaiah Launches Sundarangudu Poster
పవన్ కల్యాణ్ ఏం చెప్పారంటే...

పవన్ కల్యాణ్ ఏం చెప్పారంటే...


మెడికవర్ హాస్పిటల్‌లో పవన్ కల్యాణ్ క్లుప్తంగా మీడియాతో మాట్లాడారు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి మరిన్ని వివరాలు అందిస్తాం. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారు. ఈ హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేస్తున్నాం. మీకు అన్ని విషయాలు త్వరలోనే వెల్లడిస్తాం అని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళనతో కనిపించడం, కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X