twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    6 ప్లాపుల తర్వాత ప్యూర్ హిట్: ‘చిత్రలహరి’పై పబ్లిక్ టాక్ (వీడియో)

    |

    Recommended Video

    Chitralahari Movie Public Talk | Sai Dharam Tej | Kalyani Priyadarshan | Sunil | Kishore Tirumala

    సాయి ధ‌రమ్ తేజ్ హీరోగా నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించిన మూవీ 'చిత్ర‌ల‌హ‌రి'. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేథా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టించారు.

    శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. హైదరాబాద్‌లోని ప్రాసాద్స్ ఐమాక్స్ వద్ద ఈ మూవీ ఫస్ట్ షో చూసిన ప్రేక్షకులు ఫిల్మీబీట్‌తో తమ అభిప్రాయాలు పంచుకన్నారు. మరి వారు ఎలా రియాక్ట్ అయ్యారో చూద్దాం.

    ‘నెవర్ గివ్ అప్' అనేది బాగా చూపారు

    ‘నెవర్ గివ్ అప్' అనేది బాగా చూపారు

    నెవర్ గివ్ అప్ అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ సినిమా ఉంది. నువ్వు ఏ పని చేసినా నమ్మకాన్ని కోల్పోకు అనే విషయం బాగా చెప్పారు. సినిమా చాలా బావుంది. ప్రతి ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ ఉంటుందని చూపించారు. తేజ్ పెర్ఫార్మెన్స్ చాలా బావుంది. సునీల్, సాయి ధరమ్ తేజ్ ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. సక్సెస్ కొట్టడం ఖాయం.

    మంచి సందేశాత్మక చిత్రం

    మంచి సందేశాత్మక చిత్రం

    సినిమా ద్వారా మంచి సందేశం ఇచ్చారు. సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్ బావుంది. 3/5 రేటింగ్ ఇవ్వొచ్చు.

    యూత్‌కు ఒక మంచి సినిమా

    యూత్‌కు ఒక మంచి సినిమా

    యూత్ గురించిన మంచి సినిమా ఇది. ఒకసారి ఓడిపోతే అలా ఉండిపోకుండా ప్రయత్నిస్తూనే ఉండాలని బాగా చెప్పారు. డైరెక్టర్ సినిమా బాగా తీశారు. కామెడీ బావుంది. సునీల్ బాగా చేశారు. వెన్నెల కిషోర్ యాక్టింగ్ బావుంది.

    సినిమా కాస్త సాగదీసినట్లు ఉన్నప్పటికీ

    సినిమా కాస్త సాగదీసినట్లు ఉన్నప్పటికీ

    సాయి ధరమ్ తేజ, ఇతర నటీనటుల యాక్టింగ్ బావుంది. సినిమాలో ఓటమే విజయానికి తొలిముట్టు అని చెప్పారు. అలా ఎన్నో ఓటములు చూసిన సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతో హిట్టుకొట్టాడు. సినిమా కాస్త సాగదీసినట్లు ఉన్నప్పటికీ చాలా బావుంది. పోసాని కృష్ణ మురళి తండ్రి పాత్ర స్పూర్తిదాయకంగా ఉంది. కొడుకు ఎన్నో సార్లు ఓడిపోతున్నా బ్యాకప్ ఇచ్చి తండ్రి దండ్రులకు కూడా మంచి సందేశం ఇచ్చారు. మన కొడుకులు, కూతుళ్ల మీద మనకు నమ్మకం ఉండాలి అని చూపించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం పిల్లలకు ప్లస్సవుతుందని చెప్పే ప్రయత్నం చేశారు.

    వాళ్ల మామ లుక్ ట్రై చేశాడు.. బావుంది

    వాళ్ల మామ లుక్ ట్రై చేశాడు.. బావుంది

    ఈ జనరేషన్‌కు తగిన విధంగా ఉంది. ఇప్పుడున్న కాంపిటీషన్లో ఎంత హార్డ్ వర్క్ చేయాలి అనేది బాగా చూపించారు. సాయి ధరమ్ తేజ్ గత చిత్రాలకంటే బావుంది. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. లుక్ పరంగా వాళ్ల మామలాగా ట్రై చేయడం బావుంది.

    డెప్త్ ఉన్న సినిమా ఇది

    డెప్త్ ఉన్న సినిమా ఇది

    సాయి ధరమ్ తేజ్ చాలా డెప్త్‌తో తీసిన సినిమా. యూత్ బాగా కనెక్ట్ అయితే బావుంటుంది. అప్పట్లో కమల్ హాసన్ ఆకలి రాజ్యం ఎలా హిట్టయిందో... సాయి ధరమ్ తేజ్‌కు ఇది హిట్టవుతుంది. ఆ సినిమాలో కమల్ హాసన్ ఉద్యోగం కోసం పోరాటం చేస్తే... ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సక్సెస్ కోసం చేశాడు.

    6 ప్లాపుల తర్వాత ప్యూర్ హిట్

    6 ప్లాపుల తర్వాత ప్యూర్ హిట్

    6 ప్లాపుల తర్వాత సాయి ధరమ్ తేజ్ ప్యూర్ హిట్ కొట్టాడు. మంచి స్టోరీలైన్. లవ్ అనేది లైఫ్ లో ఉండొచ్చు. దాని కోసం కెరియర్ వదిలేయవద్దు అని మంచి కాన్సెప్టుతో తీశారు. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా మీరు అనుకున్నది వదులుకోకూడదని చెప్పడం బావుంది.

    పబ్లిక్ టాక్ వీడియో

    సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా `నేను శైల‌జ` ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌ నిర్మిస్తోన్న చిత్రం `చిత్ర‌ల‌హ‌రి`. సాయిధ‌ర‌మ్‌తేజ్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్, నివేదా పేతురాజ్‌ హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని.

    English summary
    Sai Dharam Tej, Nivetha Pethuraj and Kalyani Priyadarshan’s film Chitralahari Public Talk out. The movie get clean U certificate without any cuts. Chitralahari directed by Kishore Tirumala with Sai Dharam Tej, Kalyani Priyadarshan, Sunil, Nivetha Pethuraj and Vennela Kishore in lead roles on Mythri Movie Makers banner. The film is gearing to release on 12th April 2019.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X