కాపాడిన అబ్దుల్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. ఇదే చివరి స్పందన అంటూ..

మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అబ్దుల్ ఫర్హాన్ అనే యువకుడు తక్షణమే స్పందించి అంబులెన్స్ కి ఫోన్ చేసి అతనిని కాపాడారు. ఇక తేజ్ ని ప్రాణాలతో రక్షించడంతో అబ్దుల్ ఇప్పుడు మెగా అభిమానులకు హీరోగా మారిపోయాడు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి అతను పెద్ద మొత్తంలో డబ్బు సాయం అందింది అంటూ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు వినిపించాయి.

అయితే ఆ విషయంలో ఇదివరకే ఒకసారి సాయి ధరమ్ తేజ్ అతనికి అండగా ఉంటానని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఆ తరువాత అబ్దుల్ ఇంటర్వ్యూ కూడా కొత్త కాంట్రవర్సీకి దారి తీసింది. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ వెంటనే సోషల్ మీడియాలో మరో క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

Sai dharam tej clarifications fake news and comments on abdul help

ఆ కథనాలపై అబ్దుల్ రియాక్షన్: గత కొద్ది రోజులుగా తేజ్ కూడా అబ్దుల్ కి సాయం అందించారు అంటూ యూట్యూబ్ ఛానల్స్ లో కథనాలు ప్రసారం అవుతూ వచ్చాయి. వీటిపై అబ్దుల్ కూడా రియాక్ట్ అయ్యి సోషల్ మీడియాలో జరుగుతున్న వాటిని తప్పుడు ప్రచారాలు అంటూ కొట్టి పారేశారు.

తాను సాయిధరమ్ తేజ్ నుంచి ఎలాంటి సహాయం ఇప్పటివరకు పొందలేదని కూడా పేర్కొన్నారు. అంతే కాకుండా ఆ హీరో నుంచి అలాగే మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదని ఎవరు సహాయం కూడా చేయలేదు అని అన్నారు.

Sai dharam tej clarifications fake news and comments on abdul help

సాయిధరమ్ తేజ్ ని కలుస్తానని: అలాగే తేజ్ తో తానూ మాట్లాడలేదని చెప్పారు. అవకాశం వస్తే సాయిధరమ్ తేజ్ ని కలుస్తానని కూడా అన్నారు. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాల కారణంగా తాను కూడా మానసికంగా ఇబ్బంది పడినట్లు తెలిపారు. అంతే కాకుండా తన పాత జాబ్ ఒకటి మానేసి ఇప్పుడు మరో జాబ్ చేసుకుంటున్నట్లు అబ్దుల్ తెలియజేశాడు.

సాయి ధరమ్ తేజ్ రియాక్షన్: ఇక క్రమంలో అబ్దుల్ మాట్లాడిన వీడియోలు వైరల్ కావడంతో తేజ్ కూడా రియాక్ట్ అయ్యి సోషల్ మీడియాలో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తాను అబ్దుల్ కి డబ్బు సాయం చేసినట్లు ఏ ఇంటర్వ్యూలలో కూడా చెప్పలేదని స్పష్టం చేశారు. అబ్దుల్ తనకు చేసిన సహాయానికి తాను, తన కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. అతను మొదట నన్ను చూసి హాస్పిటల్ కు తీసుకు వెళ్లి నా ప్రాణాలు కాపాడు. అతని రుణం తీర్చుకోలేనిది అని అన్నారు.

Sai dharam tej clarifications fake news and comments on abdul help

ఇదే నా చివరి రియాక్షన్: అతడి వివరాలు తమ దగ్గర లేవని అయితే అబ్దుల్ ఫర్హాన్ ఎప్పుడైనా మేనేజర్ ద్వారా తనను కలవచ్చని తేజ్ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. తనమీద, తన టీం మీద అసత్య ప్రచారాలు నడుస్తున్నాయని తెలిపారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వివాదంపై ఇదే తన చివరి రియాక్షన్ అంటూ సాయి ధరమ్ తేజ్ ప్రెస్ నోట్ లో క్లారిటీ ఇచ్చేశారు. మరి ఇక్కడితో ఈ వివాదానికి ముగింపు కార్డు పడుతుందా లేదా అనేది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X