twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రికార్డులన్నీ పవన్ చరణాగతం: ‘అజ్ఞాతవాసి’ టీజర్‌పై టాలీవుడ్ స్టార్స్

    By Bojja Kumar
    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' టీజర్ శనివారం సాయంత్రం విడుదలవ్వగా రికార్డు స్థాయి వ్యూస్ సొంతం చేసుకుంది. 20 గంటల్లోనే ఈ టీజర్ చూసిన వారి సంఖ్య 5.5 మిలియన్ (55 లక్షలు) చేరింది. మరో వైపు యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఈ టీజర్ నెం.1 స్థానంలో ఉంది. టీజర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

    సాయి ధరమ్ తేజ్ ట్వీట్

    ‘అజ్ఞాతవాసి' టీజర్ మీద పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.... ‘స్వాగతం కృష్ణా రికార్డులన్నీ నీ చరణాగతం కృష్ణా..' అంటూ ప్రశంసలు కురిపించాడు. ఆయన అన్నట్లే రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటూ ‘అజ్ఞాతవాసి' టీజర్ దూసుకెళుతోంది.

    అదిరిపోయింది

    ప్రముఖ తెలుగు కమెడియన్ వెన్నెల కిషోర్ స్పందిస్తూ... బ్యూటీ అంటే అదీ, టీజర్ అదిరిపోయింది అంటూ ట్వీట్ చేశారు.

    ఆల్ ది బెస్ట్ చెప్పిన శ్రీకాంత్

    ప్రముఖ నటుడు శ్రీకాంత్ స్పందిస్తూ... టీజర్ చాలా బావుంది, పవన్ కళ్యాణ్‌తో పాటు ఎంటైర్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేశారు.

     పవన్ వీరాభిమాని నితిన్

    పవన్ వీరాభిమాని నితిన్

    నితిన్‌ స్పందిస్తూ... ‘వావ్‌.. అద్భుతం.. కిక్‌ ఇచ్చింది.. పవర్‌స్టార్‌ రచ్చ చేశారు. త్రివిక్రమ్‌ సర్‌ చక్కగా తీశారు. ‘అజ్ఞాతవాసి' టీజర్‌ షేక్‌ చేసింది. జనవరి 10వ తేదీ త్వరగా రా..' అంటూ కామెంట్ చేశాడు.

     మంచు మనోజ్ స్పందిస్తూ

    మంచు మనోజ్ స్పందిస్తూ

    మంచు మనోజ్ స్పందిస్తూ... ‘అజ్ఞాతవాసి' టీజర్‌ అద్భుతంగా ఉంది. నా సోదరుడు పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, మొత్తం యూనిట్‌ సభ్యులకు ఈ సినిమా సూపర్‌ బ్లాక్‌బస్టర్‌ కావాలని కోరుకుంటున్నా'. అని ట్వీట్ చేశారు.

     సమస్త ప్రేక్షక హృదయవాసి

    సమస్త ప్రేక్షక హృదయవాసి

    పరుచూరి గోపాలకృష్ణ... స్పందిస్తూ ‘‘అజ్ఞాతవాసి' సమస్త ప్రేక్షక హృదయవాసి అయ్యేలా ఉంది! టీజర్‌ చూస్తేనే సినిమా చూసినంత తృప్తి కలిగింది. పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌ రాధాకృష్ణ, మొత్తం చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌' అని వ్యాఖ్యానించారు.

    ఏందీ షాటు..

    ఏందీ షాటు..

    యంగ్ హీరో నిఖిల్ స్పందిస్తూ....‘ఏందీ షాటు.. ‘అజ్ఞాతవాసి' టీజర్‌లో నాకు ఎంతో నచ్చింది. కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌. 2018 జనవరి 10వ తేదీని గుర్తు పెట్టుకోండి' అంటూ పవన్‌ ఎంట్రీ స్టిల్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

     ఊహాతీతం

    ఊహాతీతం

    తెలుగు సినీ రచయిత, దర్శకుడు బీవీఎస్‌ రవి స్పందిస్తూ.... ‘వీరి చర్యలు వూహాతీతం' అంటూ కామెంట్ చేశారు.

    మాటల్లేవ్...

    గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె స్పందిస్తూ.... ‘టీజర్ చూసిన తర్వాత మాటలు రావడం లేవు.. 01-10-2018 కోసం ఎదురుచూస్తున్నాం అంతే..' అంటూ ట్వీట్ చేశారు.

    మెహర్ రమేష్

    మెహర్ రమేష్

    దర్శకుడు మొహర్ రమేష్ స్పందిస్తూ... అజ్ఞాతవాసి టీజర్ అద్భుతంగా ఉందని, సంక్రాంతికి దిపావళి మాదిరిగా టపాసులు పేలడం ఖాయం అంటూ ట్వీట్ చేశారు.

    కోటి దాటుతుందని అంచనా

    కోటి దాటుతుందని అంచనా

    ‘అజ్ఞాతవాసి' టీజర్ టాలీవుడ్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక యూట్యూబ్‌లోనే ఆదివారం మధ్యాహ్నం వరకు 55 లక్షల మంది చూశారు. ఇతర మాధ్యమాల్లో కలిపి టీజర్ వ్యూస్ కోటి దాటే అవకాశం ఉందని అంటున్నారు.

     సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్

    సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్

    త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అజ్ఞాతవాసి' చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. జనవరి 10న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా విడుదలవుతోంది. యూఎస్ఏలో ఈ చిత్రం రికార్డు స్థాయి స్క్రీన్లలో విడుదలవుతోంది.

    English summary
    "Agnyaathavaasi Teaser will Creates new records in Tollywood". Sai Dharam Tej tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X