ప్రచారానికి అనుమతి ఇవ్వలేదు.. ఆయన మాట కాదని ఏ పనీ చేయను.. సాయిధరమ్ తేజ్!

Recommended Video

Sai Dharam Tej Comments On Janasena Party And Pawan Kalyan || Filmibeat Telugu

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం చిత్రలహరి చిత్రంలో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తేజు కెరీర్ కు చాలా కీలకం. సాయి ధరమ్ తేజ్ నటించిన గత చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. ఈ చిత్రాన్ని దర్శకుడు ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిస్తున్నాడు. కళ్యాణి ప్రియదర్శన్, నివేద పెతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. చిత్రలహరి చిత్రం విడుదలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 12న చిత్రలహరి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 తిరుమలలో తేజు

తిరుమలలో తేజు

శుక్రవారం రోజు చిత్రలహరి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో సాయిధరమ్ తేజ్ తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం సాయిధరమ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల మెగా హీరోలంతా పవన్ కళ్యాణ్ జనసేనకు మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. రాంచరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్ ఇలా ఒక్కొక్కరుగా జనసేన పార్టీకి మద్దతు తెలుపుతున్నారు.

అలా చేయొద్దు అన్నారు

అలా చేయొద్దు అన్నారు

జనసేన పార్టీకి ప్రచారం చేసే విషయం గురించి సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. రాజకీయాలు, సినిమాలు రెండూ అంటూ అటొక కాలు, ఇటుక కాలు వేయొద్దని కళ్యాణ్ గారు తనతో చెప్పినట్లు తేజు తెలిపారు. జనసేనకు ప్రచారం చేయడానికి నాకు కళ్యాణ్ మావయ్య అనుమతి ఇవ్వలేదు. ఆయన మాట కాదని నేను ఏ పని చేయను అని సాయిధరమ్ తేజ్ తెలిపాడు.

 చాలా కీలకం

చాలా కీలకం

ఇక సినిమాల విషయానికి వస్తే సుప్రీం చిత్రం తర్వాత సాయిధరమ్ తేజ్ కు ఇంత వరకు ఒక్క హిట్టు కూడా లేదు. వరుసగా ఆరు పరాజయాలు ఎదురయ్యాయి. ఆరంభంలో క్రేజీ హీరోగా దూసుకుపోతున్న తేజు వరుస ప్లాపులతో డీలా పడ్డాడు. దీనితో చిత్రలహరి చిత్రం సాయిధరమ్ తేజ్ కెరీర్ పుంజుకోవడానికి చాలా కీలకం కానుంది. కిషోర్ తిరుమల దర్శత్వంలో తెరకెక్కిన చిత్రలహరి పాజిటివ్ బజ్ తో విడుదలవుతోంది.

ఇద్దరు హీరోయిన్లు

ఇద్దరు హీరోయిన్లు

ఈ చిత్రంలో తేజు సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేద పెతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. సునీల్, పోసాని కృష్ణ మురళి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఆకట్టుకుంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X