For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెహ్రీన్ గోల్డెన్ లెగ్గా? అయితే మేమేంటీ.. రెజీనా పేరు చెప్పగానే తలకొట్టుకొన్న సాయిధరమ్..

  By Rajababu
  |

  మెగా మేనల్లుడిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన సాయిధరమ్ తేజ్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. మెగా క్రేజ్ అండతోపాటు సొంతంగా ఇమేజ్‌ను సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జవాన్ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు.

  జవాన్ కమర్షియల్ సినిమా

  జవాన్ కమర్షియల్ సినిమా

  జవాన్ కమర్షియల్ అంశాలు ఉండే సినిమానే. సినిమా తీసిన నిర్మాతకు డబ్బులు రావాలంటే కమర్షియల్ ఎలిమెంట్స్ తప్పనిసరి. అందుకే నా చిత్రాలు కమర్షియల్ ఫార్మాట్‌లో ఉంటాయి.

   శతమానం చేయకపోవడం వెనుక

  శతమానం చేయకపోవడం వెనుక

  శతమానం భవతి చిత్రం కథ నా దగ్గరికి వచ్చింది నిజమే కాని. నేను రిజెక్ట్ చేసినట్టు వచ్చిన వార్తలు నిజం కాదు. డేట్స్ సమస్య కారణంగానే నేను ఆ సినిమా చేయలేకపోయాను. దిల్ రాజు సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉండటం కారణంగా నేను డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాను.

  బ్యాక్‌గ్రౌండ్ ముఖ్యం కాదు..

  బ్యాక్‌గ్రౌండ్ ముఖ్యం కాదు..

  సినిమా పరిశ్రమలో రాణించాలంటే బ్యాక్‌గ్రౌండ్ అనేది ప్రధానం కాదు. టాలెంట్ ఆధారంగానే ఛాన్సులు వస్తాయి. టాలెంట్ లేకపోతే అవకాశాలు రావడం కష్టం. బ్యాక్‌గ్రౌండ్ కారణంగా అదనంగా మరో ఛాన్స్ వస్తుందేమో. అంతేగానీ, అంతకంటే గొప్ప మేలేమీ ఉండదు.

   అవకాశాల కోసం చాలా కష్టపడ్డాను..

  అవకాశాల కోసం చాలా కష్టపడ్డాను..

  నేను హీరోగా ప్రయత్నించే సమయంలో నాకు కూడా చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఆడిషన్స్‌కు వెళ్లాను. కేరింత సినిమాలో ఓ పాత్ర కోసం ఆడిషన్స్‌కు వెళ్లాను. అయితే నా ఆడిషన్ చూసిన తర్వాత నాకు ఆ పాత్ర కరెక్ట్ కాదు అని చెప్పడంతో ఆ సినిమాను వదులుకొన్నాను.

  చిరంజీవి హార్డ్ వర్కర్..

  చిరంజీవి హార్డ్ వర్కర్..

  మెగాస్టార్ చిరంజీవిలో హార్డ్‌వర్క్ నాకు స్ఫూర్తి. సినీ పరిశ్రమలో ఆయన స్థాపించిన సామ్రాజ్యంలోనే మేమంత బతుకుతున్నాం. పవన్ కల్యాణ్‌లో కమిట్‌మెంట్, నిజాయితీ అంటే చాలా ఇష్టం. అతను మాట ఇస్తే ఆయన కట్టుబడి ఉంటాడు.

  చరణ్, వరుణ్, అల్లు అర్జున్ గురించి

  చరణ్, వరుణ్, అల్లు అర్జున్ గురించి

  చరణ్, వరుణ్, అల్లు అర్జున్‌లో నాకు చాలా క్వాలిటీలో నచ్చుతాయి. అల్లు అర్జున్ హార్డ్ వర్కర్. ప్రతీసారి చాలా విభిన్నంగా ఉండాలని కోరుకొంటాడు. చరణ్ రాయల్ ప్రిన్స్ లాంటివాడు. తండ్రి చిరంజీవి ఇమేజ్‌కు భంగం కలుగకుండా జాగ్రత్త పడుతాడు. వరుణ్ చాలా విభిన్నమైన వ్యక్తి.

  మెహ్రీన్ గోల్డెన్ లెగ్గా?

  మెహ్రీన్ గోల్డెన్ లెగ్గా?

  హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా గోల్డెన్ లెగ్ అంటే నేను ఒప్పుకోను. మేమంత అంత కష్టపడి సినిమా చేస్తాం. అమ్మాయి లెగ్ పెడితే సినిమా హిట్ అవుతుందా? రైటర్ కథ రాసి, డైరెక్టర్, నిర్మాత కష్టపడితే కేవలం హీరోయిన్‌ అడుగుపెట్టగానే సినిమా హిట్ అవుతుందా? కాకపోతే మెహ్రిన్ మంచి హీరోయిన్. కాకపోతే ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది.

  నేను అరెస్ట్ అయితే

  నేను అరెస్ట్ అయితే

  నేను ఒకవేళ అరెస్ట్ అయితే నేను వేగంగా వాహనం నడిపి పట్టుబడి ఉంటాను అని నా కుటుంబం అనుకుంటుంది. నేను వేగంగా వాహనం నడుపుతాను. అందుకే నా కుటుంబం అలా అనుకోవడానికి అవకాశం ఉంది. జీవితంలో నాకు డబ్బు కంటే ప్రేమ చాలా ముఖ్యమైంది.

   రెజీనా అనగానే తలపట్టుకొని

  రెజీనా అనగానే తలపట్టుకొని

  ఇంటర్వ్యూలో భాగంగా ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నల సందర్భంగా కొందరు అమ్మాయిలతో ముచ్చటించారు. నాకు పక్కన ఏ హీరోయిన్ నచ్చుతుంది అనే ప్రశ్నకు రెజీనా అని ఫ్యాన్స్ సమాధానం సాయిధరమ్ తేజ్ తలకొట్టుకొన్నారు.

  తమిళంలో కూడా అవకాశాలు

  తమిళంలో కూడా అవకాశాలు

  తమిళంలో కూడా నాకు అవకాశాలు వస్తున్నాయి. కథలు నచ్చకపోవడం వల్ల చేయడం లేదు. మంచి స్క్రిప్టు వస్తే నేను ద్విభాషా చిత్రంలో నటించడానికి సిద్ధం అని సాయి ధరమ్ తేజ్ అన్నారు.

  English summary
  Sai Dharam Tej's latest movie is Jawan. BVS Ravi is the director. Mehrin Pirzada is the heroine. This movie set to release on December 1. This occassion, He spoke to media and revealed few Interesting things about Chiranjeevi, Pawan Kalyan, Mehrin, Regina.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X