ఆయనలో నా తల్లిని చూసుకొన్నా.. స్ట్రగుల్స్‌లో అండగా.. ఎవరిమాట వినొద్దు.. సాయిధరమ్ తేజ్

Recommended Video

Sai Dharam Tej Speech At Chitralahari Success Meet || Filmibeat Telugu

వరుస ఫెయిల్యూర్స్ తర్వాత సాయిధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో సక్సెస్ సొంతం చేసుకొన్నారు. చిన్న చిత్రంగా వచ్చి భారీ విజయాన్ని చిత్రలహరి చేజిక్కించుకొన్నది. ఈ సినిమా భారీ సక్సెస్ వైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్, సునీల్, హైపర్ ఆది, పోసాని, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యారు. ఆయన ఏమన్నారంటే..

నా సక్సెస్ కాదు.. అందరిదీ

నా సక్సెస్ కాదు.. అందరిదీ

చిత్రలహరి సక్సెస్ నా ఒక్కరిది కాదు. ఈ సినిమాకు పనిచేసిన యూనిట్ సభ్యులు.. సినిమాను చూసి స్ఫూర్తి పొందిన వారి విజయం. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ పోరాటం ఆగదు. తప్పకుండా మీ లక్ష్యాన్ని చేరుకొంటారు. కాదు.. జరగదు అంటూ ఎవరెన్నీ చెప్పినా వినకుండా మీ ప్రతిభను మీరు నమ్ముకోండి.

ఫెయిల్యూర్స్‌లో అవకాశం ఇచ్చిన

ఫెయిల్యూర్స్‌లో అవకాశం ఇచ్చిన

ఫెయిల్యూర్స్‌లో ఉన్న నాకు అవకాశం ఇచ్చిన మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవిశంకర్, మోహన్ థ్యాంక్స్. సాంకేతిక నిపుణులు చాలా కష్టపడి పనిచేశారు. హీరోయిన్లు కల్యాణి ప్రియదర్శి, నివేథా పేతురాజ్ చక్కగా నటించారు. సినిమాలో కెమెరామెన్ నా లుక్‌ను మార్చేశారు. నాకు గడ్డం బాగుంటుందని చెప్పారు.

సునీల్ నేను స్ట్రగుల్స్‌లో

సునీల్ నేను స్ట్రగుల్స్‌లో

నా గ్లాస్‌మెట్స్ సునీల్, హైపర్ ఆది నాకు చాలా సపోర్ట్ చేశారు. సునీల్, నేను చాలా స్ట్రగుల్ అవుతున్న సమయంలో సక్సెస్ కొట్టాలని డిసైడ్ అయ్యాం. మేమంత చాలా కష్టపడ్డాం. మా సీన్లపై హోంవర్క్ చేశాం. హైపర్ ఆది ఇన్‌పుట్స్ ఇచ్చారు. ఎడిటింగ్‌లో మంచి సీన్లు పోయాయి.

 పోసాని అంటే నాకు చాలా ఇష్టం

పోసాని అంటే నాకు చాలా ఇష్టం

సినిమాలో నా తండ్రి పాత్రను పోషించిన పోసాని అంటే నాకు ఇష్టం. చిత్రలహరిలో సినిమా షూట్‌లో నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆయన చెప్పే చిన్న చిన్న మాటలు నాకు బాగా ఇష్టం. నా మొదటి సినిమా నుంచి నాకు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. సినిమాలో పోసాని పాత్రలో నా తల్లిని చూసుకొన్నాను. నేను ఫెయిల్యూర్స్‌లో ఉన్న సమయంలో పోసాని మాదిరిగానే నా తల్లి నాకు సపోర్ట్ ఇచ్చేవారు అని సాయిధరమ్ తేజ్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X