Just In
- 5 hrs ago
పవన్ కల్యాణ్‌తో సమంత అక్కినేని.. ఆ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది అందుకేనా?
- 6 hrs ago
ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డ శ్రియ.. లండన్‌లో పోలీసుల తూటా తప్పించుకొని!
- 7 hrs ago
రామ్ చరణ్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. ఆ ఫ్యాన్‌కు అంకితమిచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు
- 8 hrs ago
సెక్స్ అంటే చాలా ఇష్టం.. నాకు నచ్చిన వాళ్లతో తిరుగుతాను: యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్
Don't Miss!
- News
పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ... ప్రధాని మోడికి 600 మంది మేధావుల లేఖ
- Sports
బీసీసీఐ లేకుండా టీమిండియా మూడేళ్లు క్రికెట్ ఆడింది.. గంగూలీ ఎంపికతో ఆశ్యర్యపోయా: రవిశాస్త్రి
- Finance
పెరిగిన టారిఫ్‌లు.. మరి ఇప్పుడైనా టెలికాం షేర్లు కొనవచ్చా?
- Lifestyle
బురదలో రొమాన్స్ : ఈ ఫొటో షూట్ ను చూసి తట్టుకోవడం కష్టం.. దీనిపై నెటిజన్లు ఏమంటున్నారంటే..
- Automobiles
మీ అభిమాన హీరో మోటార్ సైకిల్ ఇప్పుడు ఖరీదైనదిగా మారింది
- Technology
యూఎస్‌లో స్టార్టయిన న్యూ మాక్ ప్రో ఆర్డర్స్
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
వెంకీమామ సాంగ్‌కు మెగా మేనళ్లుడికి లింక్.. వీడియో వైరల్.. ఎమోషనల్ అయిన హీరో
వెంకీ మామ ఫస్ట్ లుక్, పోస్టర్స్, టీజర్‌తో ఎంతగా జనాల్లోకి వెళ్లిందో అందరికీ తెలిసిందే. నిజజీవితంలో మామఅల్లుళ్లైన విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య తెరపైనా.. అవే పాత్రల్లో నటించడమే అందుకు కారణం. ఎక్కడో ఒక చోట వారిద్దర్నీ రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌లో చూడొచ్చని వారి అభిమానుల ఆశ. ఈ చిత్రంతో వెంకీ అభిమానులు, అక్కినేని ఫ్యాన్స్ ఇద్దరి ఆశ తీరబోతోంది.

వైరల్ అవుతోన్న పాట..
వెంకీ మామ నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్ ఎంతో ఎమోషనల్‌గా ఉండటంతో వైరల్ కాసాగింది. మామ గురించి తన అల్లుడు పాడే పాటలో ఎంతో ఎమోషన్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ పాట వింటే.. చిన్నప్పటి నుంచి తన అల్లుడిని గారాభంగా పెంచిన మామ గురించి మనకు తెలుస్తోంది. మామా మామా నేనే పలికిన తొలి పదమా.. అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ మామా అంటూ పాట సాగుతూ ఉండటంతో వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్, ఎమోషన్ ఏంటన్నది అర్థమవుతోంది.

వెంకీమామలో మెగా ఫ్యామిలీ..
మామ అల్లుళ్లులు అంటే మెగా మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు కూడా గుర్తొస్తుంటారు సినీ అభిమానులకు. పైగా సాయి ధరమ్ తేజ్‌కు తన మామలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులు అంటే ఎంత ఇష్టమన్నది ఎన్నో వేదికలపై బహిరంగంగానే ప్రకటించాడు. చిరు, పవన్ కళ్యాణ్‌లు తనకు ప్రాణమని ఎన్నో ఈవెంట్లలో అభిమానుల సాక్షిగా చెప్పాడు. ఇలా వీరి మధ్య ఉన్న బందాన్ని ఓ అభిమాని కొత్తగా ఆవిష్కరించాడు.

వెంకీమామ సాంగ్.. మెగా ఫ్యామిలీ
సాయి ధరమ్ తేజ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడుతున్న వీడియోలను, మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంలో పాల్గొన్న నాటి వీడియోను, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఈ ముగ్గురు కలిసి ఉన్న వీడియోలను లింక్ చేసి వెంకీమామ సాంగ్‌కు యాడ్ చేసి ఎడిట్ చేసేశారు. ఇక ఇంకేముంది ఎంతో ఎమోషనల్‌గా అనిపించిన ఈ ఎడిటెడ్ వీడియో అభిమానులను ఆకట్టుకుంది.

మెగా మేనళ్లుడి వద్దకు చేరిన వీడియో..
తిరిగి తిరిగి ఈ వీడియో సాయి ధరమ్ తేజ్ వద్దకు చేరుకుంది. అభిమాని క్రియేట్ చేసిన ఈ వీడియోను చూసిన మెగాహీరో.. ఎంతో ఎమోషనల్ అయినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా స్పందిస్తూ.. ఇది నాకు చాలా నచ్చింది.. ఎవరో చేశారో వారికి ధన్యవాదాలు.. వారంటే నాకెంత ఇష్టమో ఈ వీడియోను తెలియజేస్తోంది అని ట్వీట్ చేశాడు.
|
ఫుల్ జోష్‌లో ఉన్న సుప్రీమ్ హీరో..
వరుస అపజయాలతో విసిగెత్తి పోయిన సాయి ధరమ్ తేజ్‌కు.. చిత్రలహరి సినిమా కాస్త ఉపశమాన్ని ఇచ్చింది. రొటీన్‌కు భిన్నంగా.. హీరోయిజానికి దూరంగా ఉన్న ఈ పాత్రలో మెగా హీరో అద్భుతంగా నటించి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రతి రోజూ పండుగే అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ను చేస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.