6 సినిమాలు ప్లాప్, మీ వల్లే సర్వైవ్ అయ్యా: సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ స్పీచ్
Recommended Video

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ వారు నిర్మిస్తోన్న మూవీ 'చిత్రలహరి'. సాయిధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
ఏప్రిల్ 12న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోసన్లో భాగంగా టీజర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్ భావోద్వేగానకి అయ్యారు. మెగా అభిమానులను ఉద్దేశించి ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు.

సుకుమార్‌గారు అడగ్గానే ఓకే చెప్పారు
వాయిస్ ఓవర్ కావాలిసార్ అనగానే సుకుమార్ గారు 20 వేరియేషన్స్ ఇచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ అన్న మంచి సంగీతం అందించారు. 4 పాటలు బావున్నాయి. ఒక మంచి సినిమాలో భాగం అయ్యే అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్లకు థాంక్స్... అని సాయి ధరమ్ తేజ్ వ్యాఖ్యానించారు.

చెప్పిన దానికంటే బాగా తీశాడు
దర్శకుడు కిషోర్ తిరుమల కథ ఎలా చెప్పాడో... దానికంటే చాలా బాగా సినిమా తీశాడు. ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. నా కో స్టార్స్ నివేదా పేతురాజ్, కళ్యాణి ప్రియదర్శన్ ఇద్దరూ బాగా చేశారు. వారి పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుందన్నారు.

సునీల్ అన్నతో ఇంత ఆలస్యం అవుతుందనుకోలేదు
‘నువ్వు నేను' సినిమా సమయంలో సునీల్ అన్నకామెడీ టైమింగ్ చాలా ఎంజాయ్ చేసేవాడిని. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని ఉండేది. సునీల్ అన్నతో కలిసి పని చేయడానికి ఇంత కాలం పడుతుందనుకోలేదు. షూటింగ్ టైమ్‌లో అన్నతో చాలా ఎంజాయ్ చేశాను.

6 సినిమాలు ప్లాప్, మీ సపోర్టు వల్లే సర్వైవ్ అయ్యా
నాకు ఎప్పుడూ సపోర్టుగా ఉన్న మెగా ఫ్యాన్స్ అందరికీ థాంక్స్. నేను చేసిన 6 సినిమాలు మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాయి. అయినప్పటికీ నేను సర్వైవ్ అవుతున్నానంటే కారణం మీ సపోర్ట్ ఉండటం వల్లే. ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉందని సాయి ధరమ్ తేజ్ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











