ఇది చిరంజీవి సామ్రాజ్యం.. వాళ్లంతా పంచభూతాలు.. బావతో కలిసి హిట్ కొడితే కిక్కేవేరు.. సాయిధరమ్

By Rajababu

Recommended Video

బావతో కలిసి హిట్ కొడితే ఆ కిక్కేవేరు కానీ మిస్స‌య్యాం

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లి. అధినేత సి.కళ్యాణ్‌ నిర్మించిన చిత్రం 'ఇంటిలిజెంట్‌'. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్‌ అవుతుంది. ఈ సంద‌ర్భంగా రాజ‌మండ్రిలో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో...

 ఆ రేంజ్‌లో ఫంక్షన్

ఆ రేంజ్‌లో ఫంక్షన్

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ.. అత్త‌కి య‌ముడు అమ్మాయికి మొగుడు` సినిమా వంద రోజుల ఫంక్ష‌న్ త‌ర్వాత ఆ రేంజ్‌లో గ్రాండ్‌గా జరుగుతున్న ఫంక్ష‌న్ `ఇంటిలిజెంట్‌`. ప్రేక్ష‌కుల ఆశీర్వాదం మాకు ఉంటుంద‌ని భావిస్తున్నాం అని సాయి ధరమ్ తేజ్ అన్నారు.

 వినాయక్ ఇష్టమైన డైరెక్టర్

వినాయక్ ఇష్టమైన డైరెక్టర్

వివి వినాయ‌క్‌గారు నాకు ఎంతో ఇష్ట‌మైన డైరెక్ట‌ర్‌. ఆయన్ని చూడ‌గానే హోమ్లీ డైరెక్ట‌ర్ అనే ఫీలింగ్ క‌లుగుతుంది. ఇంత మంచి సినిమా చేసే అవ‌కాశాన్ని ఆయ‌న నాకు ఇచ్చారు. ఆయ‌న చాలా పెద్ద డైరెక్ట‌ర్. ఇంకా ఎన్నో హైట్స్ ఆయ‌న చేరుకోవాల‌ని కోరుకుంటున్నాను అని తేజు తెలిపారు.

 వినాయక్‌తో చేయడం

వినాయక్‌తో చేయడం

చిరంజీవిగారితో ఖైదీ నంబర్ 150 లాంటి క‌మ్‌బ్యాక్ ఫిలింను డైరెక్ట్ చేసిన ఆయ‌న నాతో సినిమా చేసినందుకు ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు. ఆయ‌న‌తో ప‌ని చేయ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ప్రేక్ష‌కుల‌కు, మెగాభిమానుల‌కు ఈ సినిమా గుర్తుండి పోయే సినిమా అవుతుంది అని సాయిధరమ్ తేజ్ పేర్కొన్నారు.

 సీ కల్యాణ్‌కు థ్యాంక్స్

సీ కల్యాణ్‌కు థ్యాంక్స్

ఒక ఆర్టిస్ట్‌కు కంఫ‌ర్ట్ జోన్‌ను క్రియేట్ చేసి..సినిమాను గ్రాండ్‌గా తెర‌కెక్కించ‌డానికి వెనుకాడ‌ని సి.క‌ల్యాణ్‌గారికి థాంక్స్‌. చ‌మ‌కు చ‌మ‌కు సాంగ్‌ను ఇళ‌య‌రాజా, సీతారామ‌శాస్త్రి చేతుల మీదుగా విడుద‌ల చేశాం.

వాళ్లిద్దరూ కుమ్మేశారు..

వాళ్లిద్దరూ కుమ్మేశారు..

మంచి సినిమా తీశామ‌ని న‌మ్మ‌కంతో ముందుకెళ్తున్నాం. నా స్నేహితుడు త‌మ‌న్ ఎంతో మంచి మ్యూజిక్ ఇచ్చాడు. జానీ, శేఖ‌ర్‌లు నాతో డ్యాన్స్‌ను కుమ్మించేశారు అని సాయిధరమ్ అన్నారు.

 చిరంజీవి సామ్రాజ్యంలో

చిరంజీవి సామ్రాజ్యంలో

చిరంజీవిగారు స్థాపించిన ఈ సామ్రాజ్యంలో జెండా రెప‌రెప‌ల‌నే నా గుండె చ‌ప్పుడులుగా భావించి క‌ష్ట‌ప‌డుతుంటాను. ఎప్ప‌టికీ ఇలాగే క‌ష్ట‌ప‌డుతుంటాను. నాకు మెగాస్టార్‌, ప‌వ‌ర్‌స్టార్‌, మెగాప‌వ‌ర్‌స్టార్‌, స్టైలిష్ స్టార్‌, వ‌రుణ్ ఇలా అంద‌రూ నాకు పంచ‌భూతాలు.

 బావతో కలిసి హిట్

బావతో కలిసి హిట్

మా బావ‌... బామర్ధి ఎప్పుడూ బావ మంచినే కోరుకుంటాడు. కాబ‌ట్టి.. వ‌రుణ్ సినిమా కూడా డెఫ‌నెట్‌గా హిట్ అవుతుంది. ఫిబ్ర‌వ‌రి 10న తొలిప్రేమ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఒకేరోజు ఇద్ద‌రు మెగా హీరోలు బాక్సాఫీస్ వ‌ద్ద‌కు వ‌చ్చి హిట్ కొడితే ఆ కిక్కే వేరు. ఆ రికార్డ్ మ‌నం మిస్స‌య్యాం.

వాళ్లు నాకు గురువులు

వాళ్లు నాకు గురువులు

మెగాస్టార్ చిరంజీవిగారు, ప‌వ‌ర్‌స్టార్‌ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారు, స‌హ‌జ న‌టుడు నాగ‌బాబుగారు నాకు గురువులు. వారు లేకుండా ఈ స్టేజ్‌పై నేను లేను అని సాయిధరమ్ తేజ్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X