twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ : మెగా హీరో సిక్స్ ప్యాక్ (ఫోటో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : మరో మెగా హీరో...చిరంజీవి మేనల్లుడు సాయి ధర్మ తేజ్ త్వరలో తెలుగులో లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. అటు వైవియస్ చౌదరి చిత్రంలోనూ, ఇటు ఎ.ఎస్ రవికుమార్ చౌదరి చిత్రంలోనూ సాయి ధర్మతేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటిలో పాట షూటింగ్ జరుగుతోంది. ఈ పాటలో సాయి ధర్మ తేజ్..తన సిక్స్ ప్యాక్ బాడీని ప్రదర్శించనున్నాడని టాక్. దీనికి సంభదించిన ఫోటో ఇప్పటికే నెట్ లో బయిటకు వచ్చి అందరినీ ఆకట్టుకుంటోంది.

    ఈ చిత్రం గురించి దర్శకుడు ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి మాట్లాడుతూ... గుండెల్లో గూడుకట్టుకున్న ప్రేమను సఫలం చేసుకొనేందుకు ఓ యువకుడు ఏం చేశాడనే విషయాన్ని ఆసక్తికరంగా చూపిస్తున్నామన్నారు. ఆయన దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ సంస్థ ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రెజీనా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో శ్రీహరి కీలక పాత్రలో కనిపిస్తారు.

    బన్నీ వాసు, హర్షిత నిర్మాతలు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. శ్రీహరి, రఘుబాబు, షఫీ, సురేఖావాణి తదితరులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ''సున్నితమైన ప్రేమకథ. నవతరం హృదయాలకు దగ్గరగా ఉండేలా తీర్చిదిద్దుతున్నాం. సాయిధర్మతేజ్‌ నటన, పోరాటాలు అందరికీ నచ్చుతాయి. శ్రీహరి కథను మలుపు తిప్పే పాత్రలో కనిపిస్తారు. అనూప్‌ అందించిన బాణీలు తప్పకుండా ఆకట్టుకొంటాయి''అన్నారు. మాటలు: డైమండ్‌ రత్నబాబు, వేమారెడ్డి, కళ: రమణ వంక, కూర్పు: గౌతంరాజు.

    ఇక రవికుమార్ చౌదరి గతంలో గోపీచంద్ తో యజ్ఞం,బాలకృష్ణతో వీరభధ్ర,తనీష్ తో ఏం పిల్లో..ఏం పిల్లడో చిత్రాలు డైరక్ట్ చేసారు. అలాగే ఈ చిత్రం భారీ చిత్రాలకు చిరునామా గీతాఆర్ట్స్‌, కుటుంబ కథా చిత్రాలకు చిరునామా అయ్యిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణాల శైలి కలబోతగా ఉంటుందంటున్నారు. అలాగే బన్నీవాసు గతంలో100% చిత్రాన్ని నిర్మించారు. సుకుమార్,నాగచైతన్య కాంబినేషన్ లో రూపొందిన ఆ చిత్రం మంచి విజయం సాధించింది.

    English summary
    Chiranjeevi’s nephew Sai Dharma Tej was working simultaniously for two films one under YVS chowdary direction and other under AS Ravikumar Chowdary.Currently Dharma Tej- Ravikumar Chowdary film shooting was progressing and an action sequence was shoot in Ramoji film city.In which Sai Dharma Tej is going the enthrall the mega fans with his six pack body. Regina Cassandra is playing the female lead which is produced by Bunny Vasu and Harshit on Geeta Arts banner.Anup Rubens composes music for this film
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X