త్రివిక్రమ్ గొప్పతనం అదే.. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడే అర్హత లేదు.. సాయిధరమ్ తేజ్ ఎమోషనల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం బ్రో (Bro The Avatar). జీ స్టూడియోస్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాకు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు విశేష స్పందన లభిస్తున్నది. పవన్ కళ్యాణ్ నటించిన బ్రో భారీ వసూళ్లు అంటే 87 కోట్లతో దూసుకుపోతూ హ్యాట్రిక్ విజయాన్ని అందించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ..

జీ స్టూడియోస్‌తో కలిసి ఇది నాకు మూడో సినిమా. బ్రో సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ మావయ్యతో నటించడం చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం కలిగించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి కృతఙ్ఞతలు. సముద్రఖని గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తన ప్రయాణాన్ని చిన్నగా మొదలుపెట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చారు. ముందుముందు మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటున్నాను అని సాయిధరమ్ తేజ్ అన్నారు.
సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. పవన్ కల్యాణ్ మావయ్య గురించి, దర్శకుడు త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడే అంత అర్హత నాకు లేదు. త్రివిక్రమ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. త్రివిక్రమ్ గారు నన్ను నమ్మినందుకు థ్యాంక్స్ అని సాయిధరమ్ తేజ్ అన్నారు.
నేను యాక్సిడెంట్‌కు గురైన తర్వాత నా పాత్ర గురించి ఎన్నో అనుమానాలు తలెత్తాయి. అయితే ఓ దశలో మార్చి వేద్దామని అనుకొన్న సమయంలో త్రివిక్రమ్ వద్దని అన్నారు. యాక్సిడెంట్ నుంచి నేను పూర్తిగా కోలుకునే వరకు సముద్రఖని గారిని వెయిట్ చేయించారు. బ్రో చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులు అందరికీ కృతఙ్ఞతలు అని సాయిధరమ్ తేజ్ ఎమోషనల్ అయ్యారు.
బ్రో సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్ ఆరంభంలో లభించిన గౌరవం అని ఫీలవుతున్నాను. ఇంతమంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. సాయి ధరమ్ తేజ్ లవ్లీ కో స్టార్. థమన్ గారి సంగీతం ఎంతగానో ఆకట్టుకుంది. మా సినిమాకి ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు అని కేతిక శర్మ అన్నారు.
సోమవారం (జూలై 31వ తేదీన) జరిగిన బ్రో సక్సెస్ మీట్‌లో పలువురు దర్శకులు పాల్గొన్నారు. ఈ వేడుకలో యువ దర్శకులు బాబీ, మలినేని గొపిచంద్, శ్రీవాసు తదితరులు పాల్గొన్నారు. ఈ ఫంక్షన్‌లో సినిమాలో నటించిన నటీనటులందరూ హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











