చిత్రలహరి విజయం నా ఒక్కడిది కాదు.. చాలా రోజుల తర్వాత సక్సెస్ మీట్‌లో.. సాయిధరమ్ తేజ్ ఉద్వేగం

Recommended Video

Sai Dharam Tej Got Emotional At Chitralahari Success Meet || Filmibeat Telugu

వరుస పరాజయాలతో కష్టాల్లో పడిన సాయిధరమ్ తేజ్‌కు ఉపశమనం లభించింది. ఆయన నటించిన చిత్రలహరి చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రిలీజై తొలి ఆట నుంచే ప్రేక్షకుల ప్రశంసలు అందుకొంటున్నది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్, నిర్మాతలు నవీన్, రవిశంకర్, మోహన్‌, హీరో సాయిధరమ్ తేజ్, దర్శకుడు కిషోర్ తిరుమల సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

 నా కథే తీశావని ప్రేక్షకులు

నా కథే తీశావని ప్రేక్షకులు

చిత్రలహరి సినిమా హిట్‌కు మీడియా కూడా కారణం. మీడియా సహకారం బాగుంది. సినిమా చూసిన తర్వాత చాలా మంది నా కథ మాదిరిగానే ఉంది అని మెసేజ్ చేస్తున్నారు. మంచి సినిమాను చాలా మంది జెన్యూన్‌గా ఫీలవుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. పక్కింటి కుర్రాడి పాత్రలో బాగా నటించావు.. మా నాన్న పరిస్థితి కూడా అలానే ఉందని అంటున్నారు అని సాయిధరమ్ తేజ్ అన్నారు.

రెస్సాన్స్‌తో చాలా హ్యాపీగా ఉంది

రెస్సాన్స్‌తో చాలా హ్యాపీగా ఉంది

చిత్రలహరి సినిమా నాకు ప్రత్యేకమైనది. మార్నింగ్ షో కంటే మ్యాట్నికి కలెక్షన్లు పంజుకున్నాయని నిర్మాతలు చెబుతున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత సక్సెస్ మీట్‌లో కూర్చొన్నాను. అది చాలా సంతోషంగా ఉన్నాను అని సాయిధరమ్ తేజ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

మెగా ఫ్యాన్స్‌, అందరికీ థ్యాంక్స్

మెగా ఫ్యాన్స్‌, అందరికీ థ్యాంక్స్

చిత్రలహరి సినిమా విజయం నా ఒక్కరిది కాదు.. యూనిట్ మొత్తానిది. ఈ సినిమాకు కనెక్ట్ అయిన ప్రతీ ఒక్కరిది ఈ విక్టరీ. నాకు కష్టకాలంలో కూడా నాకు అండగా ఉన్న ఫ్యాన్స్‌కు థ్యాంక్స్. నాకు సహకరించిన మెగా ఫ్యాన్స్ ధన్యవాదాలు. ట్విట్టర్‌లో వస్తున్న మెసేజ్‌ చూస్తూ ఆనందంగా ఉన్నాను. ట్వీట్లకు రీట్వీట్లు కొడుతూ సంతోషంలో మునిగిపోయాను అని సాయి ధరమ్ తేజ్ చెప్పారు.

 చిత్రలహరి మూవీకి పాజిటివ్ రెస్పాన్స్: నవీన్

చిత్రలహరి మూవీకి పాజిటివ్ రెస్పాన్స్: నవీన్

చిత్రలహరి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నది. ఎలక్షన్ల తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. వారాంతం తర్వాత లాభాల్లోకి వస్తామని డిస్టిబ్యూటర్లు చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. మార్నింగ్ షో కంటే మ్యాట్నీకి కలెక్షన్లు పెరిగాయి అని నిర్మాత ఎర్నేని నవీన్ అన్నారు.

మా కష్టానికి ఫలితం: కిషోర్ తిరుమల

మా కష్టానికి ఫలితం: కిషోర్ తిరుమల

మేము ఎలాంటి సక్సెస్ కోసం కష్టపడ్డామో.. ప్రయత్నించామో, ఆ విజయాన్ని అందించినందుకు థ్యాంక్స్. మేము అనుకొన్న సీన్లకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. ప్రతీ ఒక్కరు మా కథను సినిమాగా తీశావని అభినందిస్తున్నారు. అది మాకు చాలా హ్యాపీని కలిగిస్తున్నది అని దర్శకుడు కిషోర్ తిరుమల అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X