గాసిప్స్‌కు చెక్.. సాయిధరమ్ టాలెంటెడ్.. గోపిచంద్ సినిమాపై నిర్మాతలు క్లారిటీ..
సుప్రీం స్టార్ సాయిధరమ్ తేజ్, కమర్షియల్‌గా ఎన్నో సూపర్ హిట్లను అందించిన గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం కానున్నది. ఇంటిలిజెంట్ తర్వాత సాయిధరమ్ నటించే చిత్రం ఇదే. ఈ సినిమా మే నెలలో పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ చిత్రం శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్‌పై జే భగవాన్, జే పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి తాజాగా మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

సాయిధరమ్ తేజ్ టాలెంటెడ్
సాయిధరమ్ తేజ్ అద్భుతమైన టాలెంట్ ఉన్న హీరో. అలాంటి హీరోతో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నామని తెలియ జేయడానికి సంతోషంగా ఉన్నాం. ఈ చిత్రానికి దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తారు అని నిర్మాతలు తెలిపారు.

అద్భుతమైన స్క్రిప్ట్‌తో
కమర్షియల్ అంశాలతో తెరకెక్కించే ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడం ఖాయం. మా ముగ్గరి కలయికలో వచ్చే సినిమా అద్భుతమైన విజయం సొంతం చేసుకోనున్నదనే విషయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నాం అని భగవాన్, పుల్లారావు పేర్కొన్నారు.

సాయిధరమ్ కెరీర్‌లోనే
తాము రూపొందించబోయే చిత్రం సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే గొప్ప చిత్రం అవుతుంది. సాయిధరమ్ తేజ్ ఇప్పటి వరకు చేయని సబ్జెక్ట్ ఇది. మే నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం అని వారు వెల్లడించారు.

గాసిప్స్ చెక్
ఇంటిలిజెంట్ ఫ్లాప్ తర్వాత సాయిధరమ్ తేజ్, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చే సినిమా నిలిచిపోయిందనే వార్తలకు నిర్మాతలు భగవాన్, పుల్లారావు చెక్ చెప్పారు. ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తమ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని వారు వివరణ ఇవ్వడం గమనార్హం.


Click it and Unblock the Notifications











